ఆంధ్రప్రదేశ్‌

నేడు ఎమ్సెట్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 8: ఎపి ఎమ్సెట్-2016 ఫలితాలు సోమవారం సాయంత్రం 5 గంటలకు వెల్లడికానున్నాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో గల ప్లాటినం జూబ్లీ అతిథి గృహంలో ఫలితాలను వెల్లడిస్తారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు సెట్ కమిటీ సమావేశాన్ని విశాఖలోనే నిర్వహిస్తామని ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. సాయంత్రం ఫలితాలు వెల్లడైన అరగంట తరువాత విద్యార్థుల మొబైల్ ఫోన్స్‌కు ర్యాంకులను సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) ద్వారా తెలియజేయనున్నట్టు తెలిపారు. గత సంవత్సరం ఎమ్సెట్ ఫలితాలను నాలుగు రోజుల ముందుగా వెల్లడించగా ఈ సంవత్సరం 37,054 దరఖాస్తులు అధికంగా నమోదైనప్పటికీ ఏడు రోజుల ముందుగానే వెల్లడిస్తున్నట్టు చెప్పారు. ఫలితాలను తీతీతీ. ఘఔళౄషళఆ.్య వెభ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్‌ను ఈనెల 27న జారీ చేయనున్నట్టు తెలియజేశారు. జూన్ 6వ తేదీన సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, జూన్ 9 నుండి 18వ తేదీ వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. జూన్ 22వ తేదీ నుండి రాష్టవ్య్రాప్తంగా ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులకు జూన్ 27వ తేదీ నుండి తరగతులు ప్రారంభించే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా 3,900 మెడికల్, 1300 డెంటల్ సీట్లు ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో 3,934 సీట్లున్నాయని, 305 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో లక్షా 57వేల 74 సీట్లు ఉన్నట్టు తెలిపారు. ప్రవేశ పరీక్షకు 160 మార్కులకు 40 మార్కులను కనీస అర్హతగా పరిగణిస్తామన్నారు. ర్యాంకుల నిర్ధారణకు ఎమ్సెట్ మార్కులను 75 శాతం వెయిటేజీ గాను, 25 శాతం ఇంటర్మీడియెట్ మార్కులు వెయిటేజీగా తీసుకుంటామని డాక్టర్ సాయిబాబు తెలియజేశారు.