ఆంధ్రప్రదేశ్‌

అరటి అత్తానికి 72 పళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, మే 11: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన దూలం వెంకటేశ్వరరావు అనే రైతు అరటి తోటలోని ఒక చెట్టుకు వేసిన గెల చూపరులకు ఆశ్చర్యం గొలుపుతోంది. ఈ గెలకు ఉన్న ఒక అత్తానికి ఏకంగా 72 అరటి పండ్లు ఉన్నాయి. సాధారణంగా కర్పూరం వెరైటీ అరటి గెలకు నాలుగు నుండి పది అత్తాలుంటాయి. ఒక్కో అత్తానికి 12 నుండి 18 వరకు పండ్లు ఉంటాయి. అయితే ఈ గెలకు 16 అత్తాలు ఉండటమేకాక, ఒక అత్తానికి 72 పండ్లు ఉన్నాయి. మొత్తం గెలకు 187 పండ్లు ఉన్నాయి. ఇంకో విచిత్రమేమిటంటే వెంకటేశ్వరావుకు చెందిన ఎకరం అరటితోటలో చెట్లకున్న అరటి గెలలన్నీ 15 అత్తాలు దాటి, 150 పండ్లతో ఉన్నాయి. బుధవారం ఈ గెలలను మార్కెట్‌కు తీసుకురాగా 72 పండ్లు ఉన్న అత్తాన్ని చూడటానికి పలువురు ఆసక్తికనపర్చారు. ఇంతటి భారీ అత్తం చూడడం ఇదే మొదటిసారని పలువురు వృద్ధ రైతులు తెలిపారు. దీనిపై రాజమహేంద్రవరం హార్టీకల్చర్ హెచ్‌ఓ ఎన్ మల్లికార్జునరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ పంట పొలంలో అధిక పోషకాలు ఉండడం వల్ల, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయన్నారు. అలాగే ఫలదీకరణ సమయంలో కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఇటువంటివి జరుగుతాయని వారు తెలిపారు.