ఆంధ్రప్రదేశ్‌

ఆదిశంకరాచార్య జయంతిని జాతీయ పండుగగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 11: జగద్గురు ఆది శంకరాచార్య జయంతిని జాతీయ పండుగగా ప్రకటించాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆది శంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని శారదాపీఠంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన అనుగ్రహభాషణం చేస్తూ ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించాయంటే అందుకు శంకరాచార్యుని ఉపదేశాలే కారణమని అన్నారు. శూన్యవాదాన్ని ప్రచారం చేసిన బౌద్ధ మతాన్ని పారద్రోలిన ఆది శంకరాచార్యులు బ్రహ్మవాదాన్ని ప్రబోధించారన్నారు. నాస్తిక భావాలను తిప్పికొట్టి అద్వైత స్థాపన చేసిన శంకరాచార్యులు ప్రపంచం గర్వించదగిన ఏకైక జగద్గురువని కొనియాడారు. భారత జాతి కుల, మత రహిత సమాజాన్ని కోరుకుంటున్న రాజకీయ నాయకులు ఆదిశంకరుని భావాల ఆచరణను తుంగలో తొక్కారని మండిపడ్డారు. శారదాపీఠం ఆదిశంకరుని భావాలతో సమసమాజ స్థాపనకు కృషి చేస్తోందన్నారు. ముందుగా శరదాపీఠంలోని ఆదిశంకరుని విగ్రహానికి స్వామీజీ పంచామృతాభిషేకం చేశారు.