రాష్ట్రీయం

పాలిటెక్నిక్‌కు కొత్త రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 12: తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌లకు కొత్త రూపం రానుంది. ఇంతకాలం విద్యార్ధులు ఆసక్తి చూపకపోవడం, చేరిన వారు సైతం అనాసక్తితో చదువు మధ్యలోనే విరమించుకోవడం, ఇంకొంత మంది ఉన్నతశ్రేణికి చెందిన పాఠ్యాంశాలను అర్ధం చేసుకోలేక ఫెయిల్ కావడం తదితర కారణాలతో పాలిటెక్నిక్‌లు లక్ష్యానికి ఆమడదూరంలో ఉండిపోయాయి. రాష్ట్ర విభజన అనంతరం పాలిటెక్నిక్‌ల దుస్థితిపై దృష్టిసారించిన సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ ఎంవి రెడ్డి వాటి సంస్కరణకు నడుం బిగించారు. గ్రామాల్లో తెలుగు మీడియంలో ఉత్తీర్ణులైన వారు తీరా పాలిటెక్నిక్‌ల్లో చేరిన తరువాత కఠినమైన కరిక్యులమ్, బోధన సమస్యలతో ఫెయిల్ కావడమో, డ్రాపవుట్ కావడమో జరుగుతోంది. దీనికితోడు సమీప గ్రామాల నుండి పాలిటెక్నిక్ కాలేజీలకు రోజు వచ్చి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడం, ఉన్నా ఆర్ధికంగా భారం కావడంతో పేద విద్యార్ధులు ఆసక్తి చూపలేకపోతున్నారని కూడా గుర్తించారు. దీంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో తప్పనిసరి హాస్టల్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ఈ ఏడాది వంద కోట్ల రూపాయిలు వరకూ వెచ్చించనున్నట్టు కమిషనర్ ఎంవి రెడ్డి చెప్పారు. విద్యార్ధులు ఒత్తిడి లేకుండా చదివేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ తగ్గించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఈ అంశాలపై నిపుణుల కమిటీని వేశామని వారు అనేక సూచనలు చేశారని, కొన్ని స్పెషలైజేషన్లకు ఫిజిక్స్, కెమిస్ట్రీల అవసరం లేదని, పరీక్షల విధానం కూడా ఇందుకు అనుగుణంగా మార్చనున్నామని తెలిపారు. 54 ప్రభుత్వ కాలేజీల్లో 22 కాలేజీలకు హాస్టల్ సదుపాయం ఉందని, మిగిలిన వాటిలో కూడా ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుని అందులో హాస్టళ్లను నిర్వహిస్తామని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న మరమ్మతులను పూర్తి చేస్తామని, అన్ని కాలేజీల్లో ఇప్పటికే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ సేకరణ మొదలైందని, దీనివల్ల డూప్లికేషన్ సమస్య తీరుతుందని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా 213 కాలేజీల్లో 54 ప్రభుత్వ కాలేజీలుకాగా, రెండు కొత్త కాలేజీలున్నాయని, మరో రెండు ఎయిడెడ్ కాలేజీలున్నాయని, 166 ప్రైవేటు కాలేజీలున్నాయని చెప్పారు.