ఆంధ్రప్రదేశ్‌

నెల వయసు ఆవుదూడ పొదుగు నుండి పాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, మే 13: ఇంకా తల్లిపాలు తాగుతున్న ఆ ఆవుదూడ పాలిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ వింత వెలుగుచూసింది. పెచ్చెట్టి సత్యనారాయణ సుమారు అయిదేళ్ల వయసున్న జెర్సీ ఆవును పెంచుతున్నారు. ఈ ఆవు గతంలో రెండు దూడలకు జన్మనివ్వగా, సుమారు 40 రోజుల క్రితం మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. 40 రోజులు వయసున్న ఈ ఆవు దూడకు పొదుగు పెరిగి, పిండగా చిత్రంగా పావులీటరు వరకు పాలొచ్చాయి. సాధారణంగా ఆవులు ఏడాదిన్నర వయస్సులో ఎదకు వచ్చి రెండున్నరేళ్లకు దూడ జన్మించాక పాలిస్తుంటాయి. దీనిపై రాజవోలు పశువైద్యాధికారి ఎల్ విజయారెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా హార్మోన్ల సమతుల్యంలో వ్యత్యాసాలవల్ల ఇలా తక్కువ వయసులో దూడలు పాలిచ్చే అవకాశాలున్నాయన్నారు. తల్లి ఆవు గర్భంతో ఉన్నపుడు, పాలిచ్చే సమయంలోను ‘సైటో ఈస్ట్రోజన్స్’ ఉన్న పశుగ్రాసాలను తినడం వల్ల వాటి ప్రభావం దూడపై పడి, ఇలా అరుదుగా పొదుగు పెరిగి పాలు వస్తుంటాయని తెలిపారు. పాలు రాకుండా మందులు వాడాలని, లేకుంటే పొదుగు మరింత పెరిగి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.