రాష్ట్రీయం

వంద శాతం గృహ విద్యుదీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: ఈ నెలాఖరులోపల ఆంధ్ర రాష్ట్రంలో వంద శాతం నివాస గృహాల విద్యుద్ధీకరణ పూర్తవుతుందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. వచ్చే నెల 8వ తేదీన వంద శాతం గృహవిద్యుద్దీకరణను పూర్తి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఈదురుగాలులు, వర్షాలకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ వ్యవస్ధను పునరుద్ధరించామని ఆయన చెప్పారు. మే నెల నుంచి నవంబర్ వరకు ఆంధ్ర రాష్ట్రంలో తుపానులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ పునరుద్ధరణ సిబ్బంది బృందాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం కలిగిన చోట 24 గంటల్లోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సంబంధిత డిస్కాం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఈదురుగాలులు, వర్షాల వల్ల కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నెలాఖరు లేదా వచ్చేనెలలో నైరుతి రుతుపవనాలతో తుపానులు ఏర్పడి గతంలో మాదిరిగా విద్యుత్ వ్యవస్ధను అతలాకుతలం చేసే అవకాశం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలని అజయ్ జైన్ విద్యుత్ అధికారులను టెలికాన్ఫరెన్సులో ఆదేశించారు. చెట్లను కత్తిరించడం, బ్రేక్ డౌన్ అయిన వెంటనే విద్యుత్ మరమ్మత్తులకు హాజరు కావాలన్నారు. ముందుగా ట్రాన్స్‌ఫార్మర్లు, ఎమర్జన్సీ లైటింగ్ వ్యవస్ధలను సిద్ధం చేయాలన్నారు. గృహ వినియోగదారులు ఇంటి పై కప్పు మీద సౌరవిద్యుత్ ఉత్పత్తి వ్యవస్ధను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలన్నారు. ఈ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని, 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ఇంటిపైకప్పుమీద సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్ధను ఏర్పాటు చేస్తే రూ.25 లక్షల నగదును డిస్కాంలకు ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్నారు.

టెలికాన్ఫరెన్సులో విద్యుత్ అధికారులతో
మాట్లాడుతున్న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్