రాష్ట్రీయం

మరో రెండు కేసుల్లో ‘అగ్రిగోల్డ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: అగ్రిగోల్డ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిందితులకు ఏలూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో డిపాజిట్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశామని, మదనపల్లి, రాజమండ్రిలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు, ఏలూరు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను దర్యాప్తు చేసి వారిని అరెస్టు చేశామన్నారు.
అగ్రిగోల్డ్‌తో పలు కేసులను హైకోర్టు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే. ఈ కేసులో అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్‌ను వ్యతిరేకించాలని హైకోర్టు ఆదేశాలు గతంలో జారీ చేసింది. చార్జిషీటు వేయడానికి 90 రోజులు గడవుంటుంది. ఈ గడువులోగా సిఐడి చార్జిషీటుదాఖలు చేయలేనందు వల్ల ఏలూరు కోర్టు అగ్రిగోల్డ్ చైర్మన్ ఏ వెంకటరామారావు, ఎండి అవ్వా శేషునారాయణలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు పరిధి విస్తృతమైనందువల్ల దర్యాప్తు లోతుగా చేస్తున్నామని సిఐడి వర్గాలు తెలిపాయి. అందువల్ల నిర్ణీత కాలపరిమితి లోపల సిఐడి పోలీసులు చార్జిషీటును దాఖలు చేయలేదు. ఒక వేళ జైలు నుంచి నిందితులు బయటకు వచ్చిన వెంటనే మిగిలిన రెండు నగరాల్లో నమోదైన కేసుల్లో నిందితులను సిఐడి అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నట్లు సమాచారం. 2015లో అగ్రిగోల్డ్‌పై ఆరు కేసులు నమోదయ్యాయి. రూ. 6380 కోట్ల డిపాజిట్లను 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి అగ్రిగోల్డ్ నిర్వాహకులు వసూలు చేశారు. ఇందులో 19.52 లక్షల మంది ఆంధ్రాలో, మిగిలిన వారు తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణగా ఆస్తులను వేలం వేస్తున్నామని, దీనికి నిపుణుల కమిటీని హైకోర్టు నియమించిందని, డిపాజిటర్లను గుర్తించి వారికి హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా చెల్లిస్తామని సిఐడి అధికారులు తెలిపారు.