రాష్ట్రీయం

రేపు ఏపి ఐసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 14: ఎంసిఎ, ఎంబిఎ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎపిఐసెట్-2016ను ఈనెల 16న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 138 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు 72,065 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కీ ఈ నెల 23న , ఫలితాలు 27న విడుదల చేస్తామని ఎపిఐసెట్ కన్వీనర్ ఆచార్య రామమోహనరావు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు అర గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 10 గంటల తరువాత పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని ఆయన స్పష్టం చేశారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు అనుమతించరన్నారు. దరఖాస్తుల నమోదులో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్‌లో అవసరమైన ఆధారాలు చూపించి సరి చేయించుకోవచ్చన్నారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం నుంచి అత్యధికంగా 7,780 మంది హాజరవుతున్నారు.
అనంతపురంలో 13, భీమవరంలో 7, గుంటూరులో 15, కడపలో 10, కాకినాడలో 10, కుప్పంలో 1, కర్నూలులో 11, నెల్లూరులో 9, ఒంగోలులో 7, రాజమండ్రిలో 8, శ్రీకాకుళంలో 3, తిరుపతిలో 11, విజయవాడలో 13, విశాఖలో 14, విజయనగరంలో 2, చిత్తూరులో 3, అమలాపురంలో 1 కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ వర్సిటీల క్యాంపస్‌లో రెండు కోర్సులకు కలిపి దాదాపు 100 సీట్లు ఉన్నాయని, మిగిలినవి అనుంబంధ కళాశాలల్లో ఉన్నాయని వివరించారు.