రాష్ట్రీయం

నగదు రహిత ప్రజా పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 14: భారతదేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో నగదురహిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రధాన మంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో ప్రియాంక మహిళ గ్రూప్ సభ్యులు నడుపుతున్న చౌకధరల దుకాణంలో తెల్లకార్డుదారు ఇంట రవికుమార్‌కు 25కిలోల బియ్యాన్ని ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండేతో కలసి నగదు రహిత విధానంలో అందజేశారు. రవికుమార్ బ్యాంక్ ఖాతా నుంచి 25 రూపాయలు భారత జాతీయ నగదు చెల్లింపుల సంస్థ ద్వారా డిపో డీలర్ ఖాతాలోకి ఆటోమేటిక్ విధానంలో జమ చేయడం ద్వారా కృష్ణాజిల్లా తొలి నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టినట్లయింది.
అనంతరం అదే గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఇ-ఆధారిత ఎరువుల పంపిణీ విధానాన్ని కలెక్టర్ బాబుతో కలిసి వారు పరిశీలించారు. ఆపై ఓగిరాల గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫీడర్ ఛానల్ పూడికతీత పనులతో పాటు కూలీలకు ఆధార్ హాజరు విధానాన్ని పరిశీలించారు. పెరికపాడు గ్రామంలో ఇంటరాఫరబుల్ విధానంలో మైక్రో ఎటిఎంను వినియోగించి జరుగుతున్న పెన్షన్‌ల పంపిణీ విధానాన్ని కూడా అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బాబు జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరు తెన్నులను వివరించారు. ప్రతి నెల తొలివారంలోనే కార్డుదారులకు మెసేజ్ పంపించి అన్ని సరుకులను ఒకేసారి గౌరవప్రదంగా తీసుకెళ్లే ఏర్పాటు చేశామన్నారు. ఖచ్చితమైన పరిమాణంలో ఇ-కాటాలో తూచి సరకులు ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం తమ కార్డు ద్వారా జిల్లాలోని ఏ డిపో నుంచి అయినా సరుకులు తీసుకోగలిగే పోర్టబులిటీ విధానాన్ని అమల్లోకి తెచ్చామని తాజాగా జన్‌ధన్ యోజన, ఆధార్, మొబైల్ పద్ధతిని వినియోగించి ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నగదు రహితంగా నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు.

chitram ఆరుగొలను చౌకడిపోలో నగదు రహిత లావాదేవీలను ప్రారంభిస్తున్న అరవింద్ సుబ్రహ్మణ్యన్