రాష్ట్రీయం

జాతీయ స్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు జాతీయ స్థాయిలో జాతీయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ ఉద్యోగులు, అధికారులు, ప్రొఫెషనల్స్ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్, కార్యదర్శి వి.సుధాకర్ కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని ప్రభుత్వాలు నడుపుతున్నాయని తెలిపారు. దేశ చరిత్రలో బ్రాహ్మణులు పాలనపరంగా కీలక పాత్ర వహించిన ప్రముఖులుగా గుర్తింపు పొందారని వారు గుర్తు చేస్తూ అటువంటి బ్రాహ్మణులకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గత కొనే్నళ్లుగా బ్రాహ్మణులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ, ఇప్పటికైనా జాతీయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

chitram శనివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు వినతిపత్రాన్ని అందజేస్తున్న అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాశ్, కార్యదర్శి సుధాకర్