రాష్ట్రీయం

కర్నాటక నుంచి ఒక టిఎంసి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 14: తెలంగాణ మంచినీటి అవసరాల కోసం ఒక టిఎంసి నీటిని విడుదల చేస్తున్నట్టు కర్నాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. మహబూబ్‌నగర్ మంచినీటి అవసరాల కోసం నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు కర్నాటక వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఒక టిఎంసి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం శనివారం నిర్ణయించింది. కర్నాటక జల వనరుల ప్రిన్సిపల్ సెక్రటరీ రాకేష్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాశారు. తీవ్రమైన కరవుతో అల్లాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు కనీసం మంచినీటి అవసరాలు తీర్చేందుకు నారాయణపూర్ డ్యామ్ నుంచి నాలుగు టిఎంసిల నీటిని విడుదల చేయాలని హరీశ్‌రావు ఇటీవల కర్నాటకను కోరారు. కర్నాటక జల వనరుల శాఖ మంత్రి ఎంబి పాటిల్‌ను కలిసి చర్చించారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి ఒక టిఎంసి నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అనంతరం కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి పాటిల్, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ చేసి నారాయణపూర్ డ్యామ్‌కు బదులు గూడూరు రిజర్వాయర్ నుంచి నీటిని సోమవారం విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒక టిఎంసి నీటి విడుదలకు బెంగళూరులోని కృష్ణా భాగ్య జల నిగమ్ సంస్థ అంగీకరించింది. కర్నాటక తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి కార్యాచరణ ప్రారంభించినందుకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు కర్నాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇదే సుహృద్భావ వాతావరణంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని మంత్రి సూచించారు. గూడూరు నుంచి జూరాలకు సోమవారం నుంచి ఒక టిఎంసి నీటిని విడుదల చేయనున్నట్టు హరీశ్ రావుకు పాటిల్ తెలిపారని మంత్రి ఒఎస్‌డి శ్రీ్ధర్ దేశ్‌పాండే చెప్పారు. హరీశ్‌రావు తరువాత తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం కర్నాటక వెళ్లి ఆ రాష్ట్ర సిఎంను కలిసి నీటిని విడుదల చేయాలని కోరారు. ఒక టిఎంసి నీటిని విడుదల చేయడానికి కర్నాటక సిఎం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు.