రాష్ట్రీయం

ధర్మాసుపత్రిలో దారుణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 14: రాయలసీమకే తలమానికంగా నిలిచిన కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో దారుణం వెలుగుచూసింది. ఆసుపత్రిలో మృతిచెందిన శిశువుల మృతదేహాలను పూడ్చి పెట్టాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఆసుపత్రిలోని గైనిక్ వార్డులో శిశువుల 7 మృతదేహాలను ప్లాస్టిక్ బకెట్లో దాచిపెట్టారు. అయితే ఆ మృతదేహాలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లడంతో ఈ వ్యవహారం శనివారం వెలుగులోకి వచ్చింది. సమచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ హుటాహుటిన ఆసుపత్రిలోని గైనిక్ వార్డుకు చేరుకుని ఒక గదిలో దాచిన శిశువుల 7 మృతదేహాలను పరిశీలించి అవాక్కయ్యారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి విచారించగా ఒక శిశువు మృతదేహాన్ని ఖననం చేయడానికి రూ. 120 ఇస్తున్నారని, ఈ డబ్బులు చాలవని కూలీలు ఎవరూ రాకపోవడంతో ఎమి చేయాలో అర్థం కాక ప్లాస్టిక్ బకెట్లలో మృతదేహాలను దాచి పెట్టామని ఎస్పీకి వివరించాడు. దీంతో స్పందించిన ఎస్పీ స్వయంగా ఆ మృతదేహాలను కర్నూలు నగరంలోని బుధవారపేట శ్మశానవాటికకు తరలించి ఖననం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించామన్నారు. అలాగే నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, 3వ పట్టణ సిఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐలు ఉన్నారు.

chitram కర్నూలులోని బుధవారపేట శ్మశానవాటికలో శిశువుల మృతదేహాలను ఖననం చేయస్తున్న ఎస్పీ ఆకే రవికృష్ణ