రాష్ట్రీయం

టిఆర్‌ఎస్‌లో ఓటమి భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 14: పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని, ప్రజా విశ్వాసం కోల్పోయిన తుమ్మల ధనం, అధికార బల ప్రయోగానికి పాల్పడుతున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భర్త మరణించడంతో అదే స్థానానికి పోటీ చేస్తున్న ఒక మహిళను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రంగంలోకి దిగడంతోనే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. తాను గెలవకుంటే అభివృద్ధి ఆగిపోతుందని బెదిరిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దోచుకో దాచుకో అనే నినాదంతో అక్రమంగా సంపాదించిన కోట్లు ఖర్చు పెడుతూ టిఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. తుమ్మల ఓటమితో అభివృద్ధి ఆగుతుందని టిఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్ని పాలేరు ప్రజలు నమ్మవద్దన్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డంపెట్టుకొని అధికారం దక్కించుకున్న కెసిఆర్ రెండేళ్ళల్లో చేసిందేమిలేదన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, కేబినెట్‌లో మహిళలకు స్థానం కల్పించని మహిళా వ్యతిరేకికి పాలేరు ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు.
తుమ్మలకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్యని, కెసిఆర్‌ను వెన్నుపోటు పొడవడం ఖాయమని, గతంలో చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు తుమ్మలే ప్రధాన పాత్రధారని అందరికీ తెలుసన్నారు. పొన్నం ప్రభాకర్, గండ్ర వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ద్రోహిని పాలేరులో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని పాలేరు ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, వెంకటనారాయణ, కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.

chitram విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి