రాష్ట్రీయం

27నే ర్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: ఎమ్సెట్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 92.34 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 88.02 శాతం విద్యార్థులు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ముందుగానే ప్రకటించడం వల్ల విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు విద్యార్థులు ఆలస్యంగా హాజరైతే అనుమతించలేదు. ఇదిలావుంటే, ఎంసెట్ కీని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. కీపై అభ్యంతరాలుంటే 18న సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించనున్నట్టు కన్వీనర్ రమణారావు తెలిపారు. ఈనెల 27న ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. కొన్ని సెంటర్లలో బయోమెట్రిక్ యంత్రాలు పని చేయక మొరాయించాయి. 2,46,522 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకు జెఎన్‌టియు నుంచి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంజనీరింగ్ విభాగానికి క్యూ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మెడికల్ విభాగానికి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఎస్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. మొత్తం 470 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలుత ఈనెల 2న ఎంసెట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కొంతమంది అభ్యర్థులు 2నాటి హాల్‌టికెట్‌తో హాజరయ్యారు. అయితే వారిని పరీక్షకు అనుమతించారు. 534మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పరీక్షను ఎంపిక చేసుకున్నారు. వీరిలో 444మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా నాలుగు సెంటర్లలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించారు. 11,300 మంది ఇన్విజిలెటర్లు, 320మంది అబ్జర్వర్లు, 38మంది ప్రత్యేక పర్యవేక్షకులు ఎంసెట్ నిర్వహణలో భాగస్వామ్యమయ్యారు.
ఎంసెట్ కీని తీతీతీ.ఆఒళ్ఘౄషళఆ.జశ లో అప్ లోడ్ చేశారు. కీ పై అభ్యంతరాలుంటే ఈనెల 18 సాయంత్రం ఐదు గంటల లోపు రీళక్యఇళజూఆజ్యశఒఆఒళ్ఘౄషళఆ2016బఘౄజ.ష్యౄ కు ఫిర్యాదు చేయవచ్చని ఎంసెట్ కన్వీనర్ రమణారావుతెలిపారు.

chitram...
పరీక్షా కేంద్రంలోకి పరుగులు తీస్తున్న విద్యార్థులు