ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’యే సమస్యలకు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, మే 18: ప్రత్యేక హోదాతోనే సమస్యలకు పరిష్కారం లభించదని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి సాధించడానికి కేంద్రం చేయూతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాష్ట్ర లోటు బడ్జెట్‌ను పూడ్చాలని కోరానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జాతికే లాభమని ప్రధానికి వివరించానన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక చెరుకూరి కల్యాణ మండపంలో జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన నీరు-చెట్టు సదస్సులో ప్రసంగించారు. ఇప్పటికి 18 దఫాలు ఢిల్లీ వెళ్లానని, రూ.16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ పూడ్చాలని కోరితే, ఇప్పటికి రూ.2,500 కోట్లు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఉన్న సెక్షన్ 9,10,13 సమస్యలను పరిష్కరించాలని ప్రధానిని కోరానన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు న్యాయమైన వాటా జలాలను ఇవ్వడానికి కేంద్రమే బాధ్యత వహించాలని, ఇరు రాష్ట్రాలు కేంద్రం వద్ద కూర్చుని జల సమస్యలను పరిష్కరించుకోవాలని తాను ఏనాడో పిలుపునిచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడడంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అన్నారు. మంచికి మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం ముసుగులో అరాచకం చెలరేగడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. రైలునే దగ్ధం చేయడం దారుణమన్నారు. పనిలేని కొంతమంది ఇటువంటి సంఘటనలకు పురిగొల్పుతున్నారని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే అగ్రిగోల్డ్ వంటి సంస్థల ఆటలు సాగనిచ్చేదిలేదన్నారు. నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, కృష్ణా, పెన్నా, వంశధార, నాగవళి నదులను అనుసంధానం చేస్తామన్నారు. ఎత్తిపోతల ద్వారా రెండు కోట్ల ఎకరాలకు సాగునీరంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 450 ఎత్తిపోతల పథకాలకు రూ. 450 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. నీరు-ప్రగతి పథకంలో 12వ జిల్లాగా తూర్పుగోదావరిలో పర్యటిస్తున్నానన్నారు. గోదావరి జిల్లాల రైతులు తనపై నమ్మకముంచి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అయితే వ్యవసాయంలో ఎరువుల వినియోగం తగ్గించాలని చంద్రబాబు రైతులకు విజ్ఞప్తిచేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో చెత్త నుండి కంపోస్టు తయారుచేసే యూనిట్లను ఏర్పాటుచేసి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషిచేస్తామన్నారు. 3.84 లక్షల హెక్టార్లలో వరి సాగు ద్వారా రూ.4,174 కోట్లు, ఉద్యానవన పంటల ద్వారా రూ.3,918 కోట్లు వార్షిక ఆదాయం లభించిందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.