రాష్ట్రీయం

బెజవాడ కార్పొరేటర్ చంటిబాబుకి అరెస్ట్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: ప్రజాధనం రూ. 30 లక్షలు వెచ్చించి గత నెల 29 నుంచి ఈ నెల 11వరకు దేశంలో విజ్ఞానయాత్ర నిర్వహించిన నగర కార్పొరేటర్లు పలు సందర్భాల్లో అమర్యాదకరంగా ప్రవర్తించి విజయవాడ నగర పరువు ప్రతిష్ఠను మంటగలిపారు. పూణేకు సమీపంలో రైలులో ప్రయాణిస్తూ కొందరు మద్యం సేవించి ధూమపానం చేయటంపై తోటి ప్రయాణికులు తిరగబడటమే గాక రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా చెంపలేసుకుని క్షమాపణ చెప్పి ఏదో విధంగా బయటపడ్డారు. ఇక తిరుగు ప్రయాణంలో తెలుగుదేశం కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అలియాస్ చంటిబాబు ఢిల్లీ - హైదరాబాద్ విమానంలో తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ ఒక ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని శంషాబాద్ పోలీసులు బుధవారం ఆయన నివాస గృహానికి వచ్చి అరెస్ట్ వారెంట్ జారీ చేసి వెళ్లటం కలకలం రేపింది. తక్షణం పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని కోరగా తనకు రెండు రోజులు సమయం కావాలని, న్యాయవాదితో వచ్చి విచారణకు సహకరిస్తానని చెప్పటంతో వారు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా చంటి ఇంటి ముందు హైడ్రామా నడిచింది. ఏదో విధంగా నచ్చచెప్పి పోలీసులను వెనక్కి పంపించేందుకు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అక్కడ గుమిగూడారు. అసలు అదే రోజు రాత్రి గన్నవరం విమానాశ్రయంలోనే అరెస్ట్ చేయాలంటూ శంషాబాద్ పోలీసులు సమాచారం పంపగా ఎంపి కేశినేని నాని జోక్యంతో ఏదో విధంగా చంటి బైటపడ్డారు. ఇదిలా ఉండగా విజ్ఞానయాత్రలో టిడిపి కార్పొరేటర్ల కీచకపర్వం అంటూ వామపక్షాలు రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాయి.