రాష్ట్రీయం

భూ సేకరణ తరువాతే రైతులకు ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 19: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సమీకరణలో పాల్గొన్న రైతులకు ప్లాట్ల పంపిణీ ఇప్పట్లో సాధ్యపడేలాలేదు. రైతుల అభ్యంతరాలకు గడువు శుక్రవారంతో ముగియనుంది. ప్లాట్ల పంపిణీపై గ్రామాలవారీగా అవగాహన కార్యక్రమాలను సీఆర్డీఏ అధికారులు నిర్వహించారు. అయితే రైతులు అప్పట్లో కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడిలో రైతులు తమను జరీబు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు జరుగుతున్నాయి. వచ్చేనెల 14వ తేదీన హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఎత్తిపోతల పథకం కింద తమ గ్రామ పొలాల్లో ఏటా మూడు పంటలు పండిస్తున్నందున జరీబు భూములుగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ గ్రామ రైతుల డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించనున్నట్లు తెలిసింది. ఇదిలాఉండగా రాజధాని అవసరాలకు ఇప్పటివరకు స్వచ్ఛందంగా రైతులు 33,500 ఎకరాల భూమి ప్రభుత్వానికి అందజేశారు. ప్లాట్ల పంపిణీకి సంబంధించి 9.18 అభ్యంతర పత్రాలను సీఆర్డీఏ అధికారులు స్వీకరించారు. వీటిని పరిష్కరించిన తరువాతే పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. సీడ్ కాపిటల్ ఏర్పాటు కానున్న ఉద్దండరాయనిపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల రైతులకు పొరుగున ఉన్న గ్రామాల్లో స్థల కేటాయింపు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు కూడా రాజధాని ప్రాంతంలోనే ప్లాట్లు ఇవ్వాలి. రైతులు కోరుకున్నచోట భూములు ఇవ్వాలంటే గ్రామాల్లో అనేక అవరోధాలు ఎదురవుతాయని అధికారులు చెప్తున్నారు. భూ సమీకరణకు రైతులు మొగ్గుచూపి రాజధానికి వేల ఎకరాలు అందజేసినా సమీకరణను నిరాకరిస్తున్న రైతుల నుంచి మిగిలిన రెండువేల ఎకరాలను సేకరిస్తేకానీ రాజధానికి ఓ స్వరూపం రాదు. సీఆర్డీయే అధికారులు గత రెండు నెలలుగా సామాజిక హోదా సర్వే గ్రామసభలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఈ సర్వే పూర్తి కావాలంటే మరో రెండు నెలల వ్యవధి పడుతుందని అంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వాలి. సామాజిక హోదా సర్వే పూర్తయి నోటిఫికేషన్ ఇచ్చి సేకరణ జరిపిన తరువాతే ప్లాట్ల కేటాయింపు కానీ, రాజధాని నిర్మాణాలు కానీ చేపట్టాలి. రైతులు నిరాకరిస్తే సింగపూర్ మాస్టర్‌ప్లాన్ తిరగరాయాల్సి వస్తుందనీ, మరోసారి డిజైన్లు రూపొందించాలని సీఆర్డీఎ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో భూముల సర్వే పూర్తికాలేదు. అసైన్డు, దేవాదాయ, అటవీ భూములు ఉన్నప్పటికీ సర్వే నెంబర్లులేని (అన్ ఐడెంటిఫైడ్) భూములతో కలుపుకుని కృష్ణానదీ పరివాహక లంకభూములు రెండువేల ఎకరాల వరకు ఉన్నాయి. గ్రామాల్లో వీటిని గుర్తించాల్సి ఉంది. కాగా రైతుల ప్లాట్లకు సంబంధించిన అభ్యంతరాల గడువు పూర్తయినప్పటికీ అంతగా స్పందన రాలేదు. అవసరమైతే కోర్టుకెక్కాలనే భావనతో రైతులు ఉన్నారు. నెలరోజులు గడువు అడిగితే కేవలం 15 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారని తమకు అసలు ఏ ప్రాంతంలో ఎంతెంత ప్లాట్లు కేటాయిస్తారనే విషయమై ఇప్పటి వరకు స్పష్టతలేదని చెప్తున్నారు.