రాష్ట్రీయం

కారుదే పాలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 19: పాలేరు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి సుచరితారెడ్డిపై 45,682 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తుమ్మల నాగేశ్వరరావుకు 94,940 ఓట్లు రాగా సుచరితారెడ్డికి 49,258 ఓట్లు వచ్చాయి. పాలేరు బరిలో నిలిచిన 13 మంది అభ్యర్థుల్లో వీరిద్దరికీ మినహా మిగిలినవారంతా డిపాజిట్ కోల్పోయారు. సిపిఐ మద్దతుతో పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు 15,538 ఓట్లు మాత్రమే వచ్చాయి. గ్రామీణ నియోజకవర్గమైన పాలేరులో నోటాకు 2,785 ఓట్లు రావడం విశేషం. మొత్తం ఓట్లను 18 రౌండ్లుగా విభంజిచి 14 టేబుళ్ళపై లెక్కించారు. మొదటి రౌండ్ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి ఆధిక్యం కనబరిచారు. కాగా 13 మంది బరిలో ఉన్నప్పటికీ నోటా 2785 ఓట్లతో ఆరో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన జాజుల భాస్కర్‌కు 3,578 ఓట్లు, సుంకరి రామమూర్తికి 2,348 ఓట్లు రాగా మిగిలిన వారందరికి 600 ఓట్లలోపే రావడం గమనార్హం. అలాగే మొత్తం 29 మంది పోస్టల్ బ్యాలెట్‌ను తీసుకోగా అందులో 14 మంది మాత్రమే తమ బ్యాలెట్‌ను తిరిగి ఇచ్చారు. ఇందులో 7 టిఆర్‌ఎస్‌కు, 6 కాంగ్రెస్‌కు రాగా ఒక ఓటును తిరస్కరించారు. గత సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ కేవలం 4,100 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. నేతల ప్రచారానికి తోడు తుమ్మల చరిష్మాతో 94,940 ఓట్లు సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో సిపిఐ మద్దతుతో పోటీ చేసిన కాంగ్రెస్‌కు 65వేల ఓట్లు, టిడిపికి 47వేలు, సిపిఎంకు 43వేల ఓట్లు రాగా ఈసారి మాత్రం కాంగ్రెస్ రెండు పార్టీల మద్దతుతో పోటీలో నిలిచినప్పటికీ 49,258 ఓట్లు మాత్రమే వచ్చాయి.
అభివృద్ధి పథకాలే గెలిపించాయి: తుమ్మల
పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వచ్చిన విజయం టిఆర్‌ఎస్‌కే దక్కుతుందని ఆ పార్టీ తరఫున గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వల్లే తాను అత్యధిక మెజార్టీతో విజయం సాధించానన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు వాటిని క్షేత్రస్థాయిలో అమలయ్యేందుకు విశేషంగా కృషి చేశారన్నారు.

chitram తుమ్మలను అభినందిస్తున్న పార్టీ నేతలు