రాష్ట్రీయం

ఇకనైనా కళ్లు తెరవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ‘ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడితే సహించం. అక్రమాలు జరిగాయని, అవినీతి పాలనని నోటికొచ్చినట్టు మాట్లాడితే పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చేసిన ఆరోపణలను నిరూపించనైనా నిరూపించాలి. లేనిపక్షంలో శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్తని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ‘మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల నుంచి పాలేరు ఉప ఎన్నిక దాకా వరుసగా ఎన్నికలు ఏవైనా తమ పాలనకు ప్రజలు పట్టం కడుతున్న తీరును చూసైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి. పంథా మార్చుకొని నిర్మాణాత్మకమైన పాత్ర పోషించకపోతే మరింత అధోగతిపాలు కాకతప్పద’ని ముఖ్యమంత్రి హితవు పలికారు. ప్రతిపక్షాలకు అసలు రాజకీయ వ్యూహమే లేకుండా పోయిందనీ, వారికి తెలియకపోతే కనీసం తనను అడిగితే సలహాలు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. పాలేరు ఉప ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత గురువారం తెలంగాణ భవన్‌కు వచ్చిన ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం కోసం సమావేశమైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఇకనుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తారట! ప్రభుత్వంపై పోరాటం ఏందీ అర్థం పర్థం లేకుండా, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం అని చెబితే బాగుండేద’ని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఏ వ్యూహాన్ని అనుసరించాలో కనీసం తనను అడిగినా మంచి సలహా ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శాసనసభలో చర్చ జరిగితే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను ప్రిపేరై రాలేదన్నారు. ఇంకేప్పుడు ప్రిపేరు అవుతారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ఆవశ్యకతను శాసనసభ సాక్షిగా తాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే, ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించింది, వారు తామెందుకు బహిష్కరించారో ఇప్పటికీ స్పష్టంగా ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి విమర్శించారు.
ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి ఇలాగుంటే ఇక బిజెపికి కొత్త అధ్యక్షుడు లక్ష్మణ్ అయితే కొత్తబిచ్చగాడు పొద్దు గుర్తెరగడు అన్న చందంగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కేంద్రం ఎదో నిధులు ఇస్తే మెమేదో ఖర్చు చేయడం లేదని లక్ష్మణ్ విమర్శిస్తున్నారు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మంచినీటి ఎద్దడికి కేంద్రం రూ. 74 కోట్లు ఇస్తే తాము ఖర్చు చేసింది రూ. 354 కోట్లు అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంపై లక్ష్మణ్‌కుగానీ కేంద్ర మంత్రి దత్తాత్రేయకుగానీ సోయి ఉంటే రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురండి అని ముఖ్యమంత్రి సూచించారు. అచ్చంపేటలో అన్ని పార్టీలూ ఏకమైనా అక్కడ 20 స్థానాలకు 20 తమ పార్టీయే గెలుచుకుందనీ, అలాగే పాలేరులో కూడా అన్ని పార్టీలు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి కూటమిగా ఏర్పడినా ప్రజలు తిరస్కరించారని అన్నారు.