రాష్ట్రీయం

పొలిటికల్ పంచ్‌లతో వాట్సప్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21 : రాష్ట్రంలో రాజకీయ సమరం కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార తెలుగుదేశం- ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం-బిజెపి మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న గ్రాఫిక్స్ యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధానంగా వాట్సాప్‌లో టిడిపి-వైసీపీ మధ్య జరుగుతున్న గ్రాఫిక్ వార్ నవ్వు తెప్పిస్తోంది. అయితే అన్ని పార్టీలు తమ ప్రత్యర్ధులపై విమర్శలకు కమేడియన్ బ్రహ్మానందం వివిధ సినిమాల్లో వేసిన పంచ్ డైలాగులనే వాడుకోవడం ప్రస్తావనార్హం. టిడిపి, వైసీపీ, బిజెపికి చెందిన మీడియా విభాగం, టెక్నికల్ బృందాలు వీటిని నిర్వహిస్తుండగా, ఉత్సాహవంతులైన మరికొందరు సొంతంగా గ్రాఫిక్ డైలాగులను వండి వార్చి అందరికీ షేర్ చేస్తున్నారు.
ఈ బృందాలే గత ఎన్నికల్లో ఫేస్‌బుక్‌లో ఒకరిపై మరొకరు మాటలు, గ్రాఫిక్ యుద్ధాలు చేసుకున్నాయి. విదేశాల్లో ఉన్న టిడిపి, వైసీపీ అభిమానులంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో టిడిపికి వ్యతిరేకంగా వైసీపీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా టిడిపి సానుభూతిపరులు ఫేస్‌బుక్‌లో భీకర మాటల యుద్ధం చేసుకున్న విషయం తెలిసిందే.
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు కక్కుర్తి పనులంటూ’ వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలకు బాబు కండువా వేస్తున్న ఫొటోలు ఉంచారు. ‘చంద్రబాబు విదేశీ పర్యటన రహస్యం ఏమిటంటూ’ రెండు ప్రశ్నలు సంధించారు. మరొక దాంట్లో.. మోదీ-బాబు కలసి ఉన్న ఫొటోలకు, ‘ఇద్దరం కలసి ఏపి ప్రజలను భలే మోసం చేశాం కదా’ అన్న కామెంట్లు పెట్టారు. ప్రత్యేక హోదామీద చట్టంలో ఉన్నదే అమలుచేయాలన్న బాబు ఫోటోను, ఆ పక్కనే ఒక సామాన్యుడిని ఉంచి, ‘నీ కేసుల భయం పాడుగాను. మరీ అంత భయమైతే ఎలా బాబూ’ అన్న కామెంటు ఉంచారు. ‘రాష్ట్రానికి మోదీ సాయం చేయకపోతే ఏమవుతుంది? మన బతుకు ఆగిపోతుందా? బాబు ఉండగా ఏపికి వచ్చిన భయమేమీ లేదన్న’ కామెంటుతో మరొక గ్రాఫిక్ కామెంట్ ఉంచారు. ‘పార్టీ ఫిరాయింపులంటే రాజకీయ వ్యభిచారమే. పార్టీలు మారడం వల్ల బలం పెరగదు. బలుపు పెరుగుతుంద’న్న బిజెపి ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రాజు కామెంట్‌పై బాబు ఫొటో పెట్టారు.
ప్రత్యేక హోదా గురించి జగనే మోదీని అడగాలన్న టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కామెంట్‌కు, సినిమా నటుడు మాడా ఫొటో ఉంచి, ‘అదేంటి బాయ్యా, మనం అధికారంలో ఉన్నా వాళ్ల మగాళ్లే (ఎమ్మెల్యేలు) కావాలా? మనం అధికారంలో ఉన్నా ఆ జగనే వెళ్లి హోదా అడగాలా? మోదీని అడిగేందుకు మనకు విషయం (దమ్ము) లేదా’ అని ప్రశ్నిస్తూ మరో సెటైరికల్ గ్రాఫిక్ పెట్టారు. ఈ వార్‌లో పవన్‌ను కూడా తీసుకువచ్చారు. ‘ప్రశ్నించడానికే పార్టీ అంటా’ అని.. ‘ఈయన ప్రశ్నించిన ఒక్క విషయం చెప్పండి’ అని బ్రహ్మానందం నిలదీస్తున్న గ్రాఫిక్ ఉంచారు.
ఆరోగ్యశ్రీ సిబ్బంది వేతనాల పెంపుపై కేసీఆర్-బాబు పాలన తేడాను మరో మరో గ్రాఫిక్ ద్వారా కామెంట్లు పెట్టారు. కేసీఆర్ ఫొటో కింద తెలంగాణ ఆరోగ్యశ్రీ సిబ్బంది జీతాల పెంపు, ‘ఉద్యోగులకు వెన్నంటే’ అని కాప్షన్ ఉంచి, బాబు ఫోటో పైన ‘ఆంధ్ర ఆరోగ్యశ్రీ సిబ్బంది తొలగింపు ఉద్యోగులకు వెన్నుపోటే’ అనే కాప్షన్ పెట్టారు. వారిద్దరి ఫొటోల కింద సినీనటుడు పోసాని మురళీకృష్ణ వేసిన డైలాగును ఉంచారు. ‘నీకేదో అనుభవం ఉందీ అనుకుంటే, ఓటేసిన పాపానికి రైతుల నుంచి ఉద్యోగస్తుల దాకా...’ అంటూ కామెంటును పెట్టారు.
ఇక బాబు ప్రధానమంత్రి కావాలన్న మరో గ్రాఫిక్ కామెంట్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది. ది లీడర్ పేరుతో ‘చంద్రబాబు రావాలి దేశ భవిష్యత్తు మారాలి. ప్రధానమంత్రి చంద్రబాబు ఐతే..ఉత్తరాది వారి వివక్షతో కూడిన పెత్తందారీతనంతో రోజురోజుకూ అణగదొక్కబడుతున్న ఏపి అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ప్రధాని కావడమే మార్గం’ అన్న కామెంట్ ఉంచారు. చంద్రబాబు-మోదీ పాలనలోని తేడాను వివరిస్తూ మోదీకి వ్యతిరేకంగా వేసిన మరో గ్రాఫిక్ కామెంట్ ఆసక్తికలిగిస్తోంది. బాబు ఫొటో కింద ‘్భవిభారత ప్రధాని బాబు’ అని పెట్టి.. ‘్భవి తరాల కోసం 20 ఏళ్ల కిత్రమే జన్మభూమి నిర్వహించిన దూరదృష్టిగల నేత’ అని కామెంట్ చేశారు. పక్కనే మోదీ ఫొటో కింద ‘జన్మభూమినే స్వచ్ఛ్భారత్ పేరుతో కాపీ చేసి పబ్లిసిటీకి తప్ప ప్రజలకు పెద్దగా ఉపయోగపడని కార్యక్రమంగా మార్చిన మోడీ’అనే కామెంట్ ఉంచారు.
బాబు ఫొటోతో ‘మోదీ ప్రభుత్వ పతనం ప్రారంభం’ అని కేప్షన్ పెట్టి.. ‘ఇందిర, రాజీవ్, సోనియా, మోదీ వీళ్లందరినీ నిద్రలో కూడా భయపెట్టే కామన్ అంశం తెలుగువాడు. అప్పట్లో అన్న ఎన్టీఆర్ ఇప్పుడు బాబు. 2019 ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం కూలడం... బాబు ప్రధాని కావడం ఖాయమ’ని కామెంట్ పెట్టారు. ఇక ప్రత్యేక హోదాపై ఆందోళన చేస్తున్న చలసాని శ్రీనివాస్, సినీనటుడు శివాజీ ఫొటోలు ఉంచి బాబు కోసం అంటూ నాగస్వరం ఊదుతున్న గ్రాఫిక్ పెట్టారు. దానిపై బాబు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఈ ముగ్గురూ తెరపైకొస్తారన్న వ్యాఖ్య ఉంచారు. పైగా వారి ఫొటోలపై చలసాని శ్రీనివాస చౌదరి, శివాజీ చౌదరి, నరసింహారావు చౌదరి అని ఉంచారు.
బిజెపి కూడా బాబు దుబారాపై ఒక జాబితాను వాట్సాప్‌లో పెట్టింది. కేంద్రం ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పమంటూ బిజెపి ఎమ్మెల్యే వేసిన ప్రశ్నను ఉంచారు. జగన్ అవినీతికి అంతులేదంటూ వేసిన మరో గ్రాఫిక్ కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. లోకేష్ చేతుల్లో నోట్ల కట్టలుంచి, నాన్నారు కోసం అంటూ ఉన్న మరో గ్రాఫిక్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది.