రాష్ట్రీయం

ఎండి న్యూరాలజీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 21: కష్ట పడినందుకు ఫలితం దక్కింది. ఎండి (న్యూరాలజీ) చేయాలని తనకు ఎప్పటి నుంచో కోరిక అని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు రోజుకు దాదాపు 16 గంటలు కష్టపడి చదివి ఎమ్సెట్‌లో 7వ ర్యాంక్ సాధించానని పెద్దిరెడ్ల శైలజ పేర్కొంది. శనివారం ఎమ్సెట్ ఫలితాలు విడుదల అనంతరం శైలజ ఆంధ్రభూమితో మాట్లాడుతూ పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు చదవడం, సబ్జెక్టును లోతుగా అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించడం, అధ్యాపకులు, తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించానని చెప్పింది.
సుప్రీం తీర్పు వల్ల నీట్ రాయాల్సి వచ్చినా, ఇబ్బంది పడలేదని పేర్కొంది. నీట్‌లో కూడా సిలబస్ దాదాపు ఒకటే కావడంతో ప్రిపేర్ అవుతున్నానని, ఈలోగా సంవత్సరంపాటు వాయిదా వేయడంతో కొంత రిలీఫ్ లభించిందని చెప్పింది. కాగా శైలజకు ఇంటర్మీడియట్‌లో 985 మార్కులు వచ్చాయి. తండ్రి విశాఖలోని ఎవిఎన్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడు. తల్లి నాగమణి గృహిణి. ప్రస్తుతం ఎయిమ్స్ ప్రవేశ పరీక్షకు సిద్ధం అవుతున్నానని శైలజ తెలిపింది.