రాష్ట్రీయం

మెడిసిన్‌లో మెరిసిన కర్నూలు విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 21: వైద్యవిద్యను అభ్యసించేందుకు రాసిన ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చినా వయస్సు తక్కువ ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు, ప్రభుత్వం ఆశ్చర్యపోయేలా ఏడాది కాలంలో తిరిగి ప్రవేశ పరీక్ష రాసి శనివారం విడుదలైన మెడిసిన్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 156 మార్కులతో రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకుంది కర్నూలు విద్యార్థిని. కర్నూలు నగరంలోని జొహరాపురానికి చెందిన మాచాని హేమలత గత ఏడాది ఎంసెట్ మెడిసిన్ ఎంట్రెన్స్ రాసి 245వ ర్యాంకు సాధించింది. అయితే వైద్యవిద్యను అభ్యసించేందుకు తగిన వయస్సు లేదని ఆమెకు ఎంబిబిఎస్‌లో ప్రవేశాన్ని నిరాకరించారు. దాంతో కుంగిపోకుండా మళ్లీ ఏడాది కాలం పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఆ అమ్మాయి ఏకంగా రాష్ట్రంలోనే మొదటి ర్యాంకును సాధించి అందరినీ అబ్బురపరిచింది. దుస్తుల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న మాచాని వీరన్న కుమార్తె హేమలత చిన్న నాటి నుంచి విద్యలో ప్రతిభ కనబరుస్తూ వచ్చింది.
పదవ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన ఆ అమ్మాయి ఇంటర్‌లో 98శాతం మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను ప్రదర్శించింది. గత ఏడాది ఇంటర్ తరువాత ఎంసెట్ పరీక్ష రాసి 245వ ర్యాంకు సాధించింది. అయితే సాంకేతిక కారణాలతో సీటు పొందలేకపోయిన హేమలత మరోమారు ఎంసెట్ రాసి మొదటి ర్యాంకు సాధించడం విశేషం.
మెడిసిన్ కోర్సు వ్యయం ఇక ప్రభుత్వానిదే: సిఎం
ఎంసెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మాచాని హేమలత ప్రతిభను గుర్తించి ఆమెను ప్రత్యేక విమానంలో విజయవాడకు తీసుకు రావలసిందిగా ఆదేశించారు. ఫలితాలు విడుదలైన అనంతరం 156 మార్కులతో మొదటి స్థానం దక్కించుకున్న ఆమె విషయం అధికారుల నుంచి తెలుసుకుని సిఎం ఆశ్చర్యపోయారు. వెంటనే కర్నూలు నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి విజయవాడకు తక్షణం తీసుకురావాలని ఆదేశించడంతో అధికారులు పరుగులు పెట్టారు. ర్యాంకు వచ్చిన ఆనందంలో ఉన్న హేమలతను కర్నూలు కలెక్టర్ విజయమోహన్ ఫోన్ చేసి అభినందించి విజయవాడకు వెళ్లాల్సి ఉందని సిద్ధం కావాలని సూచించారు. ఆ వెంటనే కారు ఆమె ఇంటికి వెళ్లడంతో తండ్రి వీరన్నతో కలిసి హైదరాబాద్‌కు ఆ తరువాత విమానంలో విజయవాడకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే గత ఏడాది ర్యాంకు వచ్చినా సీటు దక్కని విషయంపై విచారం వ్యక్తం చేయడంతో పాటు పట్టుదలతో చదివి ఈ ఏడాది మొదటి ర్యాంకు సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. ఆమె వైద్య విద్యకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఎంబిబిఎస్ తరువాత న్యూరాలజీ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పేదలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని హేమలత ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందుకు హర్షం వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం అందుతుందని లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు.
‘నీట్’ వాయిదా పడకపోయి ఉంటే..
సుప్రీం కోర్టు ఆదేశాలతో నీట్ ఖచ్చితంగా రాయాల్సిన పరిస్థితి తలెత్తి ఉంటే హేమలత ఇబ్బందులు పడేదేమోనని విద్యా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత ప్రతిభను ప్రదర్శించినా వయస్సు తగ్గిన కారణంగా వైద్య విద్యనభ్యసించేందుకు ప్రవేశం పొందలేకపోవడం విచారకరమన్నారు. అయితే తిరిగి ఎంసెట్ రాసినా నీట్ కారణంగా ఆ ఫలితాలను విడుదల చేయలేదు. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి నీట్ వాయిదా వేయడంతో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో హేమలత ప్రతిభ ప్రపంచానికి తెలిసిందని లేనిపక్షంలో పరిస్థితి ఎలా ఉండేదోనని వారంటున్నారు. ప్రతిభ కనపర్చిన హేమలతకు విద్యాభిమానులు, మేధావులు, ప్రజలు అభినందనలు తెలిపారు.

చిత్రం హేమలతను అభినందిస్తున్న సిఎం