రాష్ట్రీయం

బిజెపిలో కోవర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 22: ఇతర పార్టీల నుంచి వచ్చి భారతీయ జనతాపార్టీలో చేరి పబ్బం గడుపుకుంటున్న నేతలు కాంగ్రెస్, వైకాపా కోవర్టులని, వారి విషయంలో బిజెపి అధిష్ఠానం కఠినంగా వ్యవహరించాలని విశాఖ టిడిపి నేతలు ధ్వజమెత్తారు. పార్టీ విశాఖ అర్బన్ జిల్లా మిని మహానాడు నగరంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు మాట్లాడుతూ బిజెపికి చెందిన కొంతమంది నేతలు చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. బిజెపిలో చేరిన ఇతర పార్టీల నేతలు టిడిపి, బిజెపిల మధ్య ఉన్న మిత్రత్వాన్ని దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి బండారు ధ్వజమెత్తగా, రాజకీయ లాభనష్టాలతో నిమిత్తం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేని మంత్రి అయ్యన్న డిమాండ్ చేశారు. బిజెపి నేతల తీరుపై మాజీ మంత్రి బండారు కాస్త ఘాటుగానే స్పందించారు. బిజెపిలో కీలక, సీనియర్ నేతలైన వాజ్‌పాయి, అద్వానీ వారుసుల నుంచి ఇటువంటి విమర్శలు రావట్లేదని, ఇటీవలే పార్టీలో చేరిన వారే ఇటువంటి విమర్శలకు పాల్పడుతూ మిత్ర ధర్మానికి భంగం కల్గిస్తున్నారని అన్నారు. వీరి విషయంలో బిజెపి అధిష్ఠానం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అలాగే బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి కొంతమంది నేతలు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, రైల్వేజోన్ తదితర అంశాల్లో ప్రజలను గందరగోళంలో పడేసేవిధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ న్యూఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకునేందుకు సహకరిస్తామని ప్రకటించారని, దీనిపై వీర్రాజు వంటి నేతలు అనకాపల్లి నిర్మాణానికి లక్షల కోట్లు కావాలా అంటూ వ్యంగ్యంగా విమర్శలు చేయడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిశారన్నారు. విభజన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి న్యాయం చేస్తామని ఆనాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని కోరుతున్నామన్నారు. చంద్రబాబు ప్రధాని పదవిపై మోజు పడలేదని, అవకాశం వచ్చినప్పుడు కూడా గుజ్రాల్, దేవెగౌడ వంటి వారిని ఆపదవిలో నిలిపారన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలపై తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.