రాష్ట్రీయం

కంటి ఆపరేషన్లకు నీటి ఎద్దడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నార్సింగి, డిసెంబర్ 11: కంటి ఆపరేషన్లు నిర్వహించటంలో దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచిన సరోజినీదేవి కంటి ఆసుపత్రికీ నీటి ఎద్దడి తప్పలేదు. గడిచిన మూడురోజుల నుంచి ఆసుపత్రికి నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌లో తలెత్తిన లోపాల కారణంగా సరఫరా స్తంభించింది. గురువారం అడపాదడపాగా సరఫరా అయినా, నీళ్లు ఎర్రటి రంగు, బురదతో ఉన్నందున, ఆపరేషన్లకు వినియోగిస్తే, ఇతర ఇనె్ఫక్షన్లు వస్తాయన్న భయంతో వైద్యులు శస్తచ్రికిత్సలను నిలిపివేశారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 350 నుంచి 400 వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. ఈ ఆసుపత్రికి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే గాక, కర్ణాటక, మహారాష్టల్ల్రోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. వీరిలో అవసరమైన వారికి వరుస సంఖ్యలిచ్చి ప్రతి రోజు 60 నుంచి 70 వరకు కాట్రాక్టు ఆపరేషన్లను చేస్తుంటారు. అయితే మూడు రోజుల నుంచి సరఫరా అవుతున్న నీరు ఆపరేషన్లకు వినియోగిస్తే రోగి పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదమున్నందున మూడురోజులుగా సుమారు 180 నుంచి 200 కంటి ఆపరేషన్లను నిలిపివేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు డయాబెటీస్ రోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేందుకు నానా తంటాలు పడ్డ వైద్యులు, ఇపుడు లెవెల్స్ కంట్రోల్ అయిన తర్వాత శస్తచ్రికిత్సలు నిర్వహించకుండా, వాయిదా వేయటంపై వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలు, శివార్ల నుంచి వచ్చిన రోగులను సోమవారం తర్వాత రావాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
యధావిధిగా అత్యవసర ఆపరేషన్లు: ఆర్‌ఎంవో
సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో నాలుగు రోజులుగా నీటి వసతి సరిగా లేదని, దీంతో ఆపరేషన్లు నిలిచిపోయిన మాట వస్తావమేనని ఆర్‌ఎంవో రాథోడ్ అన్నారు. అత్యవసర ఆపరేషన్లు రోజుకు ఐదు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ బెడ్‌లో పైపుల మరమ్మతుతో ఆసుపత్రికి నీటి సరఫరా సరిగా కావడం లేదని చెప్పారు. నీటిని పరీక్షల నిమిత్తం నారాయణగూడలోని ల్యాబ్‌కు పంపించామని అన్నారు. రెండు మూడు రోజుల్లో నీటి సమస్య తీరుతుందని, సోమవారం నుంచి యథావిధిగా ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు.

ఆస్పత్రిలో నీటి సరఫరా లేక బాటిల్‌లో
నీళ్లు తాగుతున్న వృద్ధ రోగి