రాష్ట్రీయం

మళ్లీ ఫలించని సాహసి కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలన్న తెలుగు సాహస యువతి నీలిమ రెండోసారి కూడా తృటిలో వైఫల్యాన్ని చవి చూశారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరాన్ని అధిరోహించి తీరాలన్న పట్టుదలతో నీలిమ ముందుకెళ్లినప్పటికీ 8,650 మీటర్లు మాత్రమే ఎక్కగలిగింది. మరో 198 మీటర్లు ఎక్కితే సమున్నత శిఖరాగ్రానికి చేరుకునే అవకాశం ఉండగా తీవ్ర స్థాయిలో వాతావరణం ప్రతికూలించడంతో రెండోసారీ వైఫల్యాన్ని చవి చూసింది. ఇక్కడి వాతావరణం సహకరించడం లేదంటూ రెండు రోజుల క్రితమే ఆమె ఎస్‌ఎమ్‌ఎస్ పంపింది. ఎవరెస్టు శిఖరాన్ని నీలిమ అధిరోహించినట్టుగా తొలుత కథనాలు వెలువడ్డాయి. తాజా వైఫల్యం నేపథ్యంలో ఎనిమిది మంది సభ్యుల నీలిమ బృందం వెనుదిరిగి మంగళవారం రాత్రి పదిగంటలకు బేస్ క్యాంప్ చేరుకుంది. ఇందులో నీలిమ మినహా ఇతర సభ్యులందరూ ఇతర దేశస్తులే. గత ఏడాది నేపాల్ భూకంపం..ఈ సారి ప్రతికూలించిన వాతావరణం నీలిమ వైఫల్యానికి కారణమయ్యాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజవర్గంలోని ముప్పాళ్ళ మండలం తురకపాలెం గ్రామానికి చెందిన పూదోట శౌరయ్య కుమార్తె నీలిమ (28) ఈ నెల 21న నేపాల్‌కు సాహసయాత్రకు వెళ్లింది. అక్కడ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంది. తొలుత నీలిమ నేపాల్‌లో తప్పిపోయి నాంకే గ్రామం చేరుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్వగ్రామమైన తురకపాలెం నుండి 30ఏళ్ళ క్రితం వీరు హైదరాబాద్ వెళ్ళారు. నీలిమ తండ్రి శౌరయ్య సీనియర్ పాత్రికేయులు. నీలిమ హైదరాబాద్‌లోని కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసి అనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. నీలిమకు సైక్లింగ్, కరాటే, నృత్యం వంటివాటిల్లో ప్రవేశం ఉంది. గతంలో స్టోక్ కాంగ్రీ (6,140 మీటర్లు), మోంట్ మీరా పీక్ (6,476 మీటర్లు) వంటి శిఖరాలను అధిరోహించిన అనుభవం నీలిమకు ఉంది.

ఎవరెస్ట్ శిఖరానికి దగ్గరలో నీలిమ.
(ఇన్‌సెట్‌లో పాత చిత్రం)