ఆంధ్రప్రదేశ్‌

ఎగువన ఆర్డీఎస్.. దిగువన సిద్దేశ్వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 24: తుంగభద్ర, కృష్ణా నదీ తీరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. దశాబ్దాల తరబడి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తుంటే ఓపిక పట్టలేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి తలెత్తింది. తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ సమస్య రెండున్నర దశాబ్దాల నుంచి నానుతోంది. ఆ సమస్య పరిష్కారానికి ఇంత కాలం వరకూ ఏలిన ఏ నాయకుడూ చొరవ చూపకపోవడంతో రైతులు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి తెలంగాణ వత్తాసు పలకడంతో ఆందోళన చెందిన కర్నూలు జిల్లా రైతులు ఎత్తు పెంచకుండా ఆర్డీఎస్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సామరస్యంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉండగా ఇంతవరకూ అలాంటి ప్రయత్నాలేవీ జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచితే తమకు కన్నీరే మిగులుతుందని కర్నూలు జిల్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాజోలిబండ మళ్లింపు పథకం పనులపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారుల బృందం బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఇక దిగువన శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణా నదిపై సిద్దేశ్వరం అలుగు నిర్మించాలన్న మూడు దశాబ్దాల డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వంపై రైతులు ఒత్తిడి పెంచుతున్నారు. సిద్దేశ్వరం అలుగు సాధన సమితి పేరుతో ఏకమైన రైతులు, ప్రభుత్వం ఇంతకాలం సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసిందన్న ఆగ్రహంతో తామే శంకుస్థాపన చేస్తామని నెల రోజుల క్రితం ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ సప్తనదీ సంగమ స్థలి వద్ద శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతానికి రైతు ప్రతినిధుల బృందం వెళ్లి స్థలాన్ని పరిశీలించి శంకుస్థాపన పైలాన్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసింది. ఈనెల 31న శంకుస్థాపనకూ సమాయత్తమవుతోంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం 31న ఎవరూ సంగమేశ్వరం వెళ్లకుండా అడ్డుకునేందుకు వ్యూహం రచిస్తోంది. సిద్దేశ్వరం అలుగు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో పలుమార్లు అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు. రోజులు గడుస్తున్నా ఆయన నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవటంతో ఓపిక నశించి శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నామని అలుగు సాధన సమితి నేతలు స్పష్టం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల తీరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వం తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు కోరుతున్నారు.

ఆర్‌డిఎస్‌ను పరిశీలిస్తున్న
బిజెపి నేతలు