ఆంధ్రప్రదేశ్‌

అట్రాసిటీ కేసుల్లో జోక్యం చేసుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 24: ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల్లో ప్రజాప్రతినిధులు ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదని, అలా ఎవరైనా చేస్తే వారి పేరును సంబంధిత ఛార్జిషీటుపై రాయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పోలీసు అధికారులకు సూచించారు. ఇలాంటి కేసుల విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఛార్జిషీటు వెనుకవైపు వారి వివరాలు రాయాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఎస్సీ ఎస్టీ కేసులకు నెల రోజుల్లోగా ఛార్జిషీట్లు దాఖలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో శివాజీ మాట్లాడారు. అట్రాసిటీ కేసులు దర్యాప్తు చేపట్టి ఛార్జిషీటు దాఖలుకు 60 రోజులు గడువుంటుందని, జాప్యం చేయకుండా సంఘటన జరిగిన 24 గంటల్లోగా సంబంధిత తహశీల్దారు ఆ ప్రాంతాన్ని సందర్శించాలన్నారు. తర్వాత ఆర్డీవో, డిఎస్పీలు వెళ్ళి త్వరితగతిన విచారణ పూర్తిచేసి, ఛార్జిషీటు దాఖలు చేసి, బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కలెక్టర్లు ప్రతి మూడు నెలలకోసారి పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించి, ఎస్సీ ఎస్టీలకు అందిస్తున్న న్యాయసేవలను తెలుసుకోవాలని సూచించారు. వచ్చే జూన్‌లోగా ఎస్సీ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు 44 ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలలో 25 శాతం సీట్లను ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సి ఉందన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ కాలనీలకు నూరు శాతం విద్యుత్ సౌకర్యం కల్పనకు, రక్షిత మంచినీటిని సమర్ధవంతంగా అందించడానికి కృషి చేస్తున్నట్టు శివాజీ చెప్పారు. కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం రవిప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.