రాష్ట్రీయం

విద్యుత్ పథకాల అమలుకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరికీ విద్యుత్ స్కీంను అమలుపరచడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ విధానాలను ఇతర రాష్ట్రాలతో పంచుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్ పూజారి ఏపి ట్రాన్స్‌కో, డిస్కాం అధికారులను కోరారు.
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో సాధించిన విజయాలపై ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ కేంద్ర విద్యుత్ శాఖకు సవివరంగానివేదిక అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నాటికి విద్యుత్ పంపిణీ నష్టాలను 9 శాతానికి తగ్గిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను పెంచనున్నట్లు చెప్పారు. 2014-15లో థర్మల్ ప్లాంట్లు దాదాపు 80.71 శాతం పిఎల్‌ఎఫ్‌ను సాధించి ఎన్టీపిసి రికార్డును అధిగమించామన్నారు. కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల సూపర్ క్రిటికల్ బాయిలర్ యూనిట్‌ను ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ రంగం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామన్నారు. ఇందన సంరక్షణ చర్యలను అమలు చేస్తున్నామన్నారు. వినియోగదారులకు విలువైన సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన విద్యుత్ స్కీంలను రాష్ట్రంలో అమలు చేసేందుకు రంగనాథన్ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ రంగంలో భారీ ఎత్తున వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగానికి నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు విద్యుత్ కోతలు లేవన్నారు. వ్యవసాయరంగానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

విద్యుత్ రంగంలో సాధించిన విజయాలపై నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్ పూజారికి అందజేస్తున్న ఏపి ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్