రాష్ట్రీయం

వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పోటీ ఖాయమైంది. విజయసాయి రెడ్డి గురువారం ఏపి అసెంబ్లీలో నామినేషన్‌ను దాఖలు చేస్తారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం తరువాత రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని గెలిపించకుండా, మరో 15 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల ఎత్తుగడలతో ఉన్నట్లు సమాచారం. వైకాపాకు అసెంబ్లీలో 67 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, వారిలో 17 మంది ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు. దీంతో వైకాపా బలం 50 మందికి పరిమితమైంది. 41 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రాజ్యసభ సీటు దక్కుతుంది. వైకాపాను రాజకీయంగా బలహీనపరిచేందుకు మరి కొందరు ఎమ్మెల్యేలను లాక్కునేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.