రాష్ట్రీయం

ఇక అందరికీ విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ విద్యుత్ స్కీంను అమలు చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖతో తెలంగాణ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం ఖరారు చేసింది. ఈ అవగాహనా ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అరవింద్ కుమార్, కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, తెలంగాణ సదరన్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జి రఘుమారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని పది జిల్లాల్లో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక ఖరారు చేశామన్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, తెలంగాణ సదరన్ డిస్కాం సిఎండి రఘుమారెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న కేంద్ర విద్యుత్ శాఖ సంయుక్త కార్యదర్శి
జ్యోతి అరోరా, తెలంగాణ ఇంధన కార్యదర్శి అరవింద్ కుమార్