రాష్ట్రీయం

ఓపెన్ బ్యాలెట్‌తో ఒరిగేదేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: రెండు తెలుగు రాష్ట్రాలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయనుండటంతో విపక్షాలు గెలిచే అవకాశం లేకున్నా పోటీ పడేందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ విధానంలో విప్ జారీ చేసే అధికారం లేకపోయినా.. ఫిరాయింపు చట్టం కింద ఎలాంటి చర్యలకు వీలు లేకపోయినా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను మానసికంగా భయపెట్టేందుకు ఒక అస్త్రంగా ఈ ఎన్నికలను వాడుకోవాలని రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలు నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు జూన్ 11న పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 2 సీట్లకు ఎన్నిక జరుగుతోంది. ఏపీలో టిడిపికి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం 3 సీట్లను, ఒక సీటును వైకాపా గెలుపొందే అవకాశం ఉంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ఉన్న ఎమ్మెల్యేల బలం ఆధారంగా రెండు సీట్లనూ సునాయాసంగా కైవసం చేసుకోనుంది. ఏపీలో తాను రెండో సీటు గెలిచే అవకాశం లేకున్నా రెండో సీటుకూ అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలో ఇదే పరిస్థితి. ఉన్న రెండు స్థానాలూ టిఆర్‌ఎస్‌కే దక్కుతాయని కాంగ్రెస్ నేతలకు తెలిసినా, ఫిరాయింపు ఎమ్మెల్యేలను మానసికంగా భయపెట్టేందుకు ఒక స్థానానికి అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తున్నారు.
నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో బలం లేని విపక్షాలు చేయగలిగింది ఏమీ ఉండదు. అలా అని ఓపెన్ బ్యాలెట్ ఉన్నంత మాత్రాన ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయానికీ గురి చేయలేరు. అయినా విపక్షాలకు ఎందుకొచ్చింది అంత ధీమా? అంటే, ఓపెన్ బ్యాలెట్ విధానం ద్వారా ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి స్పీకర్‌కు ఫిర్యాదు చేయటానికి ఒక అస్త్రంగా పనికొస్తుంది.
వాస్తవానికి ఓపెన్ బ్యాలెట్ వల్ల ఒరిగేదీ ఏమీ ఉండదు. ఆ పార్టీకి తమ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా ఓటు వేశారా? లేదా? అని మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తాము చెప్పిన వ్యక్తికి ఓటు వేయలేదని తెలిస్తే సదరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో లేదా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వకపోవడమో వంటి పార్టీ పరంగా క్రమశిక్షణా ఉల్లంఘన చర్య తీసుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప, చట్టపరంగా, న్యాయపరంగా చర్య తీసుకునేందుకు అవకాశం అసలు లేదు. ఎందుకంటే విప్ జారీ చేస్తే తప్ప పార్టీ నిర్ణయానికి ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి వారికి ఫిరాయింపు చట్టం వర్తించదు. ‘విప్’ జారీ చేయడం కూడా అసెంబ్లీ పరిధిలో ఉండే అంశాలకే వర్తిస్తుంది కానీ రాజ్యసభ ఎన్నికలకు, బయటి వ్యవహారాలకు వర్తించదు.
ఓపెన్ బ్యాలెట్ ఎందుకు వచ్చింది?
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎమ్మెల్యేలను వివిధ రకాలుగా ఆకర్షించి ఓట్లు వేయించుకుంటున్నారని, దీనిని కట్టడి చేసేందుకు ఓపెన్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా 2003లో పీపుల్స్ యూనియన్ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుదీర్ఘ వాదోపవాదాలు జరిగిన అనంతరం, కోర్టు ఓపెన్ బ్యాలెట్ నిర్వహణకు ఆదేశించింది. అప్పటి నుంచి ఓపెన్ బ్యాలెట్ విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఫిరాయింపుదారులకు, మాట వినని ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకు ఏ మాత్రం ఉపయోగపడదు. ఓపెన్ బ్యాలెట్ అంటే బ్యాలెట్‌పై ఓటు వేసి, బ్యాలెట్ బాక్సులో బ్యాలెట్ పేపర్‌ను వేయడానికి ముందు ఆ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్‌కు చూపించాలి. ఆ పేపర్‌ను అధికారులకు, ఇతర పార్టీల ఏజెంట్లకు చూపించాల్సిన అవసరం లేదు. ఇటువంటి తరుణంలో ఆంధ్రలో వైకాపా రెండో సీటుకు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటుకు పోటీ చేయడం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. తెలంగాణలో పార్టీ ఆదేశంతో కాంగ్రెస్ పార్టీ సీ ఎల్పీ కార్యదర్శి ఇప్పటికే ఓ నామినేషన్ పత్రాన్ని కొనుగోలు చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఇంకా లెక్కల్లోనే మునిగితేలుతోంది.

తెలంగాణలో
పార్టీల బలాబలాలు:
టిఆర్‌ఎస్
(2014 ఎన్నికల్లో) 63
(్ఫరాయింపులు,
విలీనాలతో) 88
కాంగ్రెస్ 13
మజ్లిస్ 7
బిజెపి 5
టిడిపి 3
సిపిఐ 1
సిపిఎం 1
ఇండిపెండెంట్ 1
నామినేటెడ్ 1
ఆంధ్ర అసెంబ్లీలో..
టిడిపి
(2014ఎన్నికల్లో) 102
(ఫిరాయంపులతో) 119
వైకాపా 50
బిజెపి 4
నవోదయ పార్టీ 1
ఇండిపెండెంట్ 1
నామినేటెడ్ 1

వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి