రాష్ట్రీయం

టాపర్ల తొలి ఛాయిస్ ఐఐటి ముంబై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: దేశవ్యాప్తంగా ఉన్న 18 ఐఐటిల్లో చేరిన విద్యార్థుల ఛాయిస్ పరిశీలిస్తే టాపర్ల దృష్టి అంతా ఐఐటి ముంబైపై పడింది. గత మూడేళ్లుగా 10లోపు ర్యాంకులు వచ్చిన టాపర్లు అంతా ఐఐటి ముంబైలో చేరుతుండగా, రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ, మూడో స్థానంలో చెన్నై వచ్చి చేరింది. నాలుగో స్థానంలో ఐఐటి కాన్పూర్ ఉండగా, ఐఐటి ఖరగ్‌పూర్ ఐదో స్థానానికి వచ్చేసింది. ఐఐటిల్లో చేరిన విద్యార్థుల అభిరుచులు, వారి కుటుంబాల విశే్లషణ, సామాజిక నేపథ్యం, పరీక్షకు సన్నద్ధమైన తీరు, ఆర్థిక స్థితి తదితర అంశాలపై వివరాలతో కూడిన నివేదికను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ బుధవారం విడుదల చేసింది. 2015 జెఇఇ అడ్వాన్స్ ప్రకారం చూస్తే టాప్ 10 ర్యాంకర్లలో తొలి ర్యాంకర్ భరత్ ఖండేల్‌వాల్ ఐఐటి ముంబైలో చేరారు. రెండో ర్యాంకర్ జానక్ అగర్వాల్ ఐఐటి ఢిల్లీలో చేరారు. వందలోపు ర్యాంకు వచ్చిన వారిలో 34 మంది ఐఐటి ముంబైని, 12 మంది ఐఐటి ఢిల్లీని, ఒక్కరు ఐఐటి గౌహతి, ఐదుగురు ఐఐటి కాన్పూర్, ముగ్గురు ఐఐటి ఖరగ్‌పూర్, 28 మంది ఐఐటి చెన్నై, 17 మంది ఐఐటి రూర్కీని ఎంపిక చేసుకున్నారు.
కంప్యూటర్ సైన్స్‌కే ప్రాధాన్యం
టాపర్లు ఎంపిక చేసుకున్న బ్రాంచిల వారీ చూస్తే తొలి ప్రాధాన్యం కంప్యూటర్ సైన్స్‌కే ఇస్తుండగా, తర్వాతి అవకాశం ఎలక్ట్రికల్‌కు, అదే క్రమంలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచిలున్నాయి. చిట్టచివరగా ఇంజనీరింగ్ ఫిజిక్స్‌ను ఎంచుకుంటున్నారు.
ఎంపికైన అభ్యర్థుల సామాజిక స్థితి గతులు, విద్యావ్యవహారాలు, కుటుంబ నేపథ్యాలను కూడా కమిటీ విశే్లషించింది. నిరుడు వివిధ ఐఐటిల్లో చేరడానికి ఎంపికైన 9974 మందిలో 25శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, 75 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారే, ఇందులో కోచింగ్ తీసుకున్న వారు 4757 మంది కాగా, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా శిక్షణ పొందిన వారు 40 మంది, వ్యక్తిగత శిక్షణతో సన్నద్ధమైన వారు 112 మంది, ఇతరులు 173 మంది కాగా, స్వీయ అధ్యయనం ద్వారా ఎంపికైన వారు 4892 మంది ఉన్నారు.
రాజస్థాన్ తర్వాత మనవాళ్లే
ఐఐటిల్లో ఎంపికైన 9974 మందిలో రాజస్థాన్‌కు చెందిన వారు 1965 మంది కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 1546 మంది ఉన్నారు. ఇందులో ఆంధ్రా నుండి 776 మంది, తెలంగాణ నుండి 770 మంది ఎంపికయ్యారు. యుపి నుండి 1259 మంది, మహారాష్ట్ర నుండి 871 మంది ఎంపికయ్యారు. అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎంపిక కాగా తర్వాత అత్యధికంగా వ్యాపారాలు చేసుకునే వారి పిల్లలు ఎంపికయ్యారని నివేదిక స్పష్టం చేసింది.