రాష్ట్రీయం

జూలై 9న టి.ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎమ్సెట్ (మెడికల్ స్ట్రీం) పరీక్ష నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. ఎమ్సెట్ -2కు సంబంధించిన షెడ్యూలు ఈ నెల 28న విడుదల కానుంది. జూలై 9న మెడికల్ ప్రవేశపరీక్ష నిర్వహించి 14న ఫలితాలను ప్రకటిస్తారు. జూన్ 1నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులను సమర్పించేందుకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా జూన్ 7 వరకూ గడువిచ్చారు. 500 రూపాయల జరిమానాతో జూన్ 14వరకూ, వెయ్య జరిమానాతో జూన్ 21 వరకూ, 5వేల జరిమానాతో జూన్ 28 వరకూ దరఖాస్తు చేసుకొనవచ్చు. 10వేల రూపాయిల జరిమానాతో జూలై 6లోగా దరఖాస్తు చేసుకునే వీలుంది. జూలై 2నుంచి జూలై 7వరకూ హాల్‌టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. పరీక్ష జూలై 9న జరుగుతుంది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరుగుతుంది. జూలై 9న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. జూలై 12లోగా ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలుపుకునే వీలుంది. జూలై 14న ర్యాంకులు ప్రకటిస్తారు. దరఖాస్తుతో పాటు జనరల్ అభ్యర్ధులు 500 రూపాయిలు, ఎస్సీ, ఎస్టీలు 250 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య మంత్రి బుధవారం సచివాలయంలో తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, ఎమ్సెట్ కన్వీనర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
జూలై 24న నీట్ పరీక్ష
దేశవ్యాప్తంగా ఓపెన్ క్యాటగిరి 15 శాతం సీట్లకు, యాజమాన్య కోటా సీట్లకు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు , ఇతర రాష్ట్రాల్లో సీట్లు కోరుకునే విద్యావిద్యార్థులు అంతా నీట్ -2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. జూలై 24న సిబిఎస్‌ఇ ఈ పరీక్షను నిర్వహించనుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో మెడికల్, డెంటల్ సీట్లను కోరుకునే వారంతా నీట్-2 రాయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.