రాష్ట్రీయం

హైదరాబాద్‌లో టర్కీ నోట్ల కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: హైదరాబాద్ నగరంలో టర్కీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని టర్కీ కరెన్సీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే తాజాగా హైదరాబాద్‌లో కూడా టర్కీ నోట్లు మార్పిడికి యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో పోలీసులకు చిక్కిన ముఠా సభ్యుల్లో కొందరు తెలంగాణలో కూడా అమాయకులను మోసగిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చినట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కరెన్సీ ముఠా వెనుక కేరళకు చెందిన ఓ ట్రస్టు ఉన్నట్టు సమాచారం. ‘లిరా’గా పిలిచే ఈ కరెన్సీ నోటు విలువ ఒక్కోటి ఐదు లక్షలు విలువ చేస్తుందని వాటిని అమాయకులను అంటబెట్టేందుకు పలు ముఠాలు హైదరాబాద్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు రెండు ముఠాలను పట్టుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా పోలీసులకు ముఠా సభ్యులు మాత్రమే పట్టుబడగా ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నట్టు క్రైం ఇనె్వస్టిగేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. వారు చిక్కితే గానీ టర్కీ కరెన్సీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. వీటి వెనక ఎవరి హస్తం ఉంది. అనే విషయాలు స్పష్టమవుతాయి. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం పట్టణానికి చెందిన అనిల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో అతనే కీలక వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. టర్కీలో ద్రవ్యోల్బణం భారీగా పడిపోయిన నేపథ్యంలో 2005లోనే అక్కడి కరెన్సీని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఒక్కో నోటుకు ఐదు లక్షల ‘లిరా’లుండడంతో 2009 వరకు అట్టి నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికే టర్కీ కరెన్సీ భారీగా ఆంధ్రా, తెలంగాణకు చేరిందని, ఆంధ్రప్రదేశ్, కేరళలోని ఓ ట్రస్టుకు విరాళంగా వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక్కో ‘లిరా’ నోటు ఐదు లక్షలు (్భరత కరెన్సీలో 11కోట్లు) కావడంతో భారీగా ఈ నోట్లు పోగయ్యాయని సమాచారం. కాగా ఆంధ్రాలో ఈ ముఠా పట్టుబడడంతో ముఠా సభ్యులు హైదరాబాద్‌లో తిష్టవేసి అమాయకులను మోసగించేందుకు పలు ముఠాలు సంచరిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అసలు సూత్రధారులు పట్టుబడితే గానీ ట్రస్టు ఎవరిది..? ట్రస్టు వెనక ఎవరున్నారు..? అనే విషయం బయటపడుతుందని టాస్క్ఫోర్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.