రాష్ట్రీయం

తెలంగాణలో సంబురాలు.. ఆంధ్రాలో ప్రతిజ్ఞలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26 : జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న దృశ్యాలు సాక్షాత్కరించనున్నాయి. ఆరోజు తెలంగాణలో ‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం’ పేరుతో సంబురాలు నిర్వహిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి హడావుడి లేకుండా ‘నవనిర్మాణ దీక్ష’ పేరుతో ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం, అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించడం, వివిధ రంగాల్లో నిష్ణాతులకు అవార్డులను ఇవ్వడం, సమావేశాలు నిర్వహించడం తదితర కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని హోటళ్లలో తెలంగాణ వంటలకు ప్రత్యేకంగా మెనూ రూపొందించి తయారు చేయాలని కూడా ప్రభుత్వం సూచించింది. అన్ని ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, బాణసంచా కాల్చాలని నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా జాతీయపతాకావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 2కు సంబంధించి ఎలాంటి హడావుడి చేయడం లేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనేది లేనే లేదు. దీనిపై చాలా పర్యాయాలు చర్చ కూడా సాగింది. ఎపికి చెందిన నేతల్లో కొంత మంది జూన్ 2 న ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని సూచిస్తుండగా, మరికొందరు నవంబర్ 1 న నిర్వహించాలని సూచించారు. ఇంకొందరు అక్టోబర్ 1 న (1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరిగిన రోజు) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని సూచించారు. అయితే ఈ మూడు రోజుల్లో ఏ రోజు కూడా ఎపి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించలేదు. 13 జిల్లాలతో కూడిన ఎపి రెండేళ్ల పసిపాప అంటూ చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అభిప్రాయపడటం గమనార్హం.
అయినప్పటికీ జూన్ రెండోతేదీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా అంగీకరించకపోవడం గమనార్హం. ఆరోజున ఉదయం 11 గంటలకు ‘నవ నిర్మాణ దీక్ష’ (ప్రతిజ్ఞ) చేయాలని ఆయన ప్రకటించారు. విజయవాడలో 30 వేల మందితో సమావేశం నిర్వహించాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో అందరి చేత ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించారు.
13 జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఆరోజు ఉదయం 11 గంటలకు అన్ని పనులను నిలిపివేసి ‘నవనిర్మాణ దీక్ష’ పేరుతో ప్రతిజ్ఞ చేయాలని ఆదేశించారు.