రాష్ట్రీయం

జూన్ 8న చేపమందు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: ఉబ్బసం రోగులకు జూన్ 8న బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపమందు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో చేపమందు కోసం హైదరాబాద్‌కు తరలి వచ్చే ఉబ్బసం రోగులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ప్రతీ ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున ఉబ్బస వ్యాధిగ్రస్తులకు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బత్తిన హరినాథ్‌గౌడ్ కుటుంబం చేపమందు పంపిణీ చేయటం తరతరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమం వచ్చే నెల 8,9 తేదీలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై రాజీవ్‌శర్మ హైదరాబాద్ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, రెవిన్యూ, విద్యుత్, వాటర్ సప్లై బోర్డు అధికారులతో రాజీవ్‌శర్మ గురువారం సమావేశం నిర్వహించారు. చేపమందు పంపిణి చేసే బత్తిన హరినాథ్‌గౌడ్ సోదరులు కూడా ఈ సమావేశానికి హాజరై రోగులకు ఇబ్బంది కలుగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం బత్తిన సోదరులు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చేపమందు పంపిణి జరిగే రోజు తమ సోదరుల ఇళ్ల వద్ద కూడా చేపమందు కేంద్రాలను ఎర్పాటు చేయనున్నట్టు చెప్పారు. చేపమందు తీసుకునే వారు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు వేసుకోవాల్సి ఉంటుందన్నారు. మృగశిర కార్తె రోజున కాకుండా నిరంతరం ఈ మందు వేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు బత్తిన హరినాథ్‌గౌడ్ వివరించారు.