రాష్ట్రీయం

ప్రైవేటు అక్రమ రవాణాను అరికట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న ప్రైవేటు అక్రమ రవాణా అంతరాష్ట్ర సర్వీసులను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ డిమాండ్ చేసింది. గురువారం బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ బాబు, రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసి లాభాల్లోకి రావాలంటే ప్రైవేటు సర్వీసులను రద్దు చేయాల్సిందేనని వారు స్పష్టం చేశారు. రోజుకూ సుమారు 2500 ప్రైవేటు బస్సు సర్వీసులు రాష్ట్రం నుంచి దూరప్రాంతాలకు అక్రమంగా నడుపుతున్నారని, తద్వారా ఆర్టీసికి సాలీన వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కళ్లెదుటే ప్రైవేటు బస్సులు నడుస్తున్నా ప్రభుత్వం కానీ, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కాని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. తమ సంస్థను కాపాడుకోవడం కోసం అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన తమ కార్యకర్తలు (స్ట్ఫా) ఈనెల 25న చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద, 29న షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద ప్రైవేటు వాహనాల వివరాలను సేకరిస్తారని తెలిపారు. జూన్ 3న చలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించి కమిషనర్‌కు ఒక మెమోరాండం అందజేస్తామని వారు పేర్కొన్నారు. తమ నివేదనను ప్రభుత్వం కానీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కాని స్పందించని పక్షంలో జూన 9న, ఎల్‌బినగర్ చౌరస్తా, ఆరామ్‌ఘర్ చౌరస్తాలో ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రైవేటు బస్సులను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వి మురళీధర్, కోశాధికారి కె రాంరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జోనల్ కార్యదర్శి జె రాఘవులు తదితరులు పాల్గొన్నారు.