రాష్ట్రీయం

హామీలన్నీ అమలు చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధి పట్ల కృతనిశ్చయంతో ఉందని, దీనిపై విపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఎపి పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి సహాయాన్ని అందిస్తూనే వున్నామన్నారు. ఎన్‌డిఏ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 15 తేదీ వరకు 20 రోజులపాటు రాష్టవ్య్రాప్తంగా జరుపుతున్న విజయోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి కేంద్రం ఏ మేరకు సహాయం అందించిందో గణాంకాలతోసహా వివరిస్తామన్నారు. వికాస్ సర్వే పేరిట విజయోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రభూమి జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హరిబాబు అనేక విషయాలు వెల్లడించారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు సాలీనా రూ.50 కోట్ల చొప్పున రూ.2,100 కోట్ల సహాయం చేయాలని నీతి అయోగ్ సూచించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన ప్రాథమిక ఆడిట్ చేయబడని 2014-15 సంవత్సర ఆర్థిక నివేదిక ఆధారంగా కేంద్రం రూ.2303 కోట్లు తాత్కాలికంగా విడుదల చేసిందన్నారు. అలాగే 2015-16 సంవత్సరానికి రూ.500 కోట్లు విడుదల చేసిందని అన్నారు. 2015-16 మొదలుకొని 2015-20 వరకు ఆంధ్ర రాష్ట్రానికి రూ.22వేల 113 కోట్లు ఆర్థిక లోటు సహాయంగా రాబోతున్నాయన్నారు. ఇందులో భాగంగా రూ.7వేల 430.66 కోట్లు ఇప్పటికే విడుదల చేయటం జరిగిందన్నారు. ఇక నూతన రాజధాని నగరంలో ముఖ్యమైన వౌలి అవసరాల నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 94(3), సెక్షన్ 04(4) వీలు కల్పిస్తోందని తెలిపారు. నీతి అయోగ్ సూచించిన రూ.2500 కోట్లను ఇప్పటివరకు రూ.1950 కోట్ల సహాయంగా అందించారు. మిగిలిన రూ.650 కోట్లు కేంద్ర సాయం కింద, రూ.200 కోట్లు ప్రత్యేక ప్రాతిపదికన విడుదల చేయడమైనదన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నీతి అయోగ్ అంచనాల ప్రకారం దీని వ్యయం రూ.16010.45 కోట్లు అయితే జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70:30 నిష్పత్తిలో ఈ వ్యయాన్ని పంచుకోవాల్సి వున్నప్పటికీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కృషి ఫలితంగా కేంద్రం నూటికి నూరు శాతం భరించడానికి నిర్ణయించుకుందన్నారు. నాబార్డు ఆర్థిక సహకారంతో ముందుగా సాగే ఈ ప్రాజెక్టుకు 2015-16లో విడుదల చేసిన రూ.400 కోట్లు కలుపుకుని మొత్తం రూ.850 కోట్లు కేంద్రం విడుదల చేసిందన్నారు.
పారిశ్రామికీకరణ పెంపొందించేందుకు 2014-15లో అనేక పన్ను రాయితీలను ద్రవ్య విధానాలను కేంద్రం ప్రకటించిందని హరిబాబు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా 2015-20 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్‌కి రూ.1,08,090.37 కోట్లు ఐదేళ్లలో అందగలదన్నారు. అలాగే రాష్ట్రానికి రూ.1.43 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రకటించడం జరిగిందన్నారు.