రాష్ట్రీయం

ఆంధ్రా ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఫలితాలను గురువారం నాడు విడుదల చేశారు. ఓపెన్ స్కూల్ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 63.86 శాతం మంది, టెన్త్ పరీక్షల్లో 61.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌కు 56,151 మంది హాజరుకాగా, వారిలో 35,859 మంది ఉతీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షలకు 49,996 మంది హాజరుకాగా, వారిలో 30,713 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఉత్తీర్ణుల్లో బాలికలు 12,896 మంది కాగా బాలురు 22,963 మంది ఉన్నారు. టెన్త్‌లో ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 10,317 మంది కాగా, బాలురు 15,700 మంది ఉన్నారు. గత ఏడాది ఇంటర్ ఉత్తీర్ణత శాతం 75.16 కాగా టెన్త్ 65.89 శాతం ఉంది, అది ఈ ఏడాది తగ్గిందని అధికారులు చెప్పారు. జిల్లాల వారీ చూస్తే ఎస్సెస్సీలో విశాఖపట్టణం 81.83 శాతంతో అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాలు అనంతపురం (80.52), పశ్చిమగోదావరి (75.72), కృష్ణ (18.41) ఉన్నాయి. అదే ఇంటర్మీడియట్‌లో 78.78 శాతంతో చిత్తూరు అగ్రస్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో నెల్లూరు (73.37), అనంతపురం(71.69), కృష్ణ(27.22) నిలిచాయి.