రాష్ట్రీయం

చెత్త సేకరణకు గ్రీన్ అంబాసిడర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 28: గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి గ్రీన్ అంబాసిడర్లను నియమించేందుకు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లాలో గ్రీన్ అంబాసిడర్లను నియమిస్తున్నారు. గ్రామాల్లో చెత్త సమస్యను పరిష్కరించే బాధ్యతలను వీరికి అప్పగించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఎంపికచేసిన గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటుచేసి, ఆయా యూనిట్ల పరిధిలో గ్రీన్ అంబాసిడర్లను నియమిస్తారు. ఇంటింటా చెత్త సేకరణతోపాటు బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. ప్రతీ గ్రామానికి 5 నుండి 10 మంది వరకు గ్రీన్ అంబాసిడర్లను నియమిస్తారు. వీరు గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్తలను సేకరిస్తారు. వీరికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల నుండి నిర్దేశించిన వేతనాలను చెల్లిస్తారు. పంచాయతీల్లో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఈ గ్రీన్ అంబాసిడర్లు విధులు నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణ, గ్రామాల్లో పరిశుభ్రత, పరిసరాల పరిరక్షణ అంశాలపై శిక్షణ పొందిన వీరు ప్రత్యేక పద్ధతిలో విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 62 సాలిడ్‌వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్లను ఇటీవల ఏర్పాటు చేశారు. మరో 62 గ్రామాల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దశల వారీగా అన్ని గ్రామాలకూ సాలిడ్‌వేస్ట్ మేనేజిమెంట్ యూనిట్లను విస్తరించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
అలాగే జిల్లాలోని నగర, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఏడాది జూలై నెలాఖరుకు జిల్లాలో అన్ని పట్టణాల్లో బహిరంగ మలవిసర్జన లేకుండా చేయడం లక్ష్యంగా నిర్ణయించారు. వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అటల్ స్వచ్ఛ్భారత్ నిధులను వినియోగిస్తున్నారు. జిల్లాలోని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని 12,887 కుటుంబాలున్నట్టు ఇటీవల నిర్వహించిన సర్వేద్వారా తెలిసింది. రందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయగా 60 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. స్మార్ట్‌సిటీగా గుర్తించిన జిల్లా కేంద్రం కాకినాడలో పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.