రాష్ట్రీయం

తెరాస ఏకగ్రీవం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవమైనట్టే. తెలంగాణ, ఆంధ్ర రాజ్యసభ స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు ఈనెల 31 చివరి తేదీ. తెలంగాణలో రెండు స్థానాలుంటే, తెరాస వినా మరే పార్టీ పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో, ఏకగ్రీవాన్ని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని తేలిపోయింది. నామినేషన్ల దాఖలుకు 31 చివరి తేదీ కాగా, తెలంగాణలోని రెండు స్థానాలకు తెరాస నుంచి మాజీ మంత్రులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల అభ్యర్థిత్వాన్ని సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెరాస అభ్యర్థులిద్దరూ 31నే నామినేషన్లు దాఖలు చేస్తారు. కాంగ్రెస్ తరఫున వి హనుమంతరావు పోటీ చేయాలని ఉత్సాహం చూపించినా, పార్టీనుంచి మద్దతు లభించలేదు. పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అవసరమైనంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో, పోటీనుంచి కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. ఒకవేళ కాంగ్రెస్ బరిలోకి దిగినా, ఉన్న ఓట్లనూ చీల్చేంత దూకుడుగా తెరాస ఉండటంతో, పోటీకి దిగడం మంచిది కాదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ బరిలోకి దిగినా, మిగిలిన పార్టీలు మద్దతిస్తాయో లేదోననే సందేహం ఆ పార్టీకి ఉంది. ఈ అంశంపై చర్చించేందుకే శనివారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె జానారెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు సిఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై సుదీర్ఘ చర్చ అనంతరం, సంఖ్యాబలం లేనందున పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జె గీతారెడ్డి, టి రాంమోహన్ రెడ్డి, టి జీవన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, పద్మావతి, భట్టివిక్రమార్క, భాస్కర రావు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాగం రంగారెడ్డి, ఆకుల లలిత, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వి హనుమంత రావు, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, రాపోలు ఆనంద భాస్కర్
పాల్గొన్నారు.
సిపిఐ, సిపిఎంకు ఉన్న ఒక్కో ఓటును కలుపుకున్నా కాంగ్రెస్ బలం 16కు మించే అవకాశం లేదని అంచనా వేశారు. మజ్లిస్ పార్టీ టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్నందున ఆ పార్టీ మద్దతు కూడగట్టడం అసాధ్యమన్న అభిప్రాయం వెలువడింది. బిజెపికి ఐదు ఓట్లున్నా, ఆ పార్టీ మద్దతు ఇవ్వదని భావించారు. తెదేపా ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు పొందినా 19ఓట్లు మాత్రమే అవుతాయి. మొత్తం 40 ఓట్లు రావాల్సిన చోట 19 ఓట్లు పొంది పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. నిజానికి ఓపెన్ బ్యాలెట్ పత్రం విధానం అమల్లో ఉన్నందున, ఫిరాయింపుదారులైన తమ పార్టీ ఎమ్మెల్యేలను మానసికంగా భయాందోళనకు గురి చేసేందుకు పోటీ చేయాలనే తొలుత కాంగ్రెస్ భావించింది. ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలు తమ పార్టీకి ఓటు వేయకుండా తెరాసకు ఓటు వేస్తే, తమ పార్టీ ఆదేశాన్ని ఉల్లంఘించారని స్పీకర్‌కు మరోసారి పిటీషన్ దాఖలు చేయవచ్చన్నది కాంగ్రెస్ భావన. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కే మద్దతిచ్చినా మొత్తం సంఖ్య 25కు మించదు. ఈ పరిస్థితుల్లో పోటీకి దిగడం అనవసరమన్న నిర్ణయానికి వచ్చి, ఆ విషయాన్ని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్, పార్టీ అధినేత్రి సోనియాకు తెలియజేయాలని నిర్ణయించారు. ఒక సమయంలో వి హనుమంతరావు ఢిల్లీవెళ్లి సోనియాను కలిసి పోటీ చేస్తానని ఆసక్తి చూపించారు. గత రాజ్యసభ ఎన్నికల్లో తెరాసకు కాంగ్రెస్ మద్దతిచ్చినందున ఈసారి తెరాస తమకు మద్దతివ్వాలని హనుమంతరావు కోరారు. హనుమంతరావు ఢిల్లీనుంచి హైదరాబాద్ రాకముందే కెసిఆర్ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో శనివారం నాటి భేటీతో ఎన్నికలకు కాంగ్రెస్ దూరమన్న విషయం తేలిపోయింది. ఆంధ్ర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేరు ఖరారైంది. తెదేపా అభ్యర్థుల జాబితా మాత్రం ఇంకా వెలువడలేదు. గతంలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దాఖలు రోజునే అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. ఆదివారం వరకూ మహానాడు జరుగుతుంది. ఈసారీ గత సంప్రదాయం ప్రకారమే చివరి రోజే అభ్యర్థుల పేర్లు వెలువడే అవకాశం ఉంది.

chitram కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్