ఆంధ్రప్రదేశ్‌

‘మంజునాథ’ ఎదుట వాదనలు వినిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 28: ముద్రగడ పద్మనాభం శనివారం హైదరాబాద్‌లో చిరంజీవి, దాసరిని కలవడంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కావాలంటే మంజునాథ కమిషన్ ముందు వాదనలు వినిపించాలే తప్ప ఇలా చిరంజీవి, దాసరిని కలిసి ఉపయోగం లేదన్నారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ మేరకు మంత్రి నారాయణ స్పందించారు. అదే సమయంలో ముద్రగడకు మద్దతిస్తానని చెప్పిన దాసరి, చిరంజీవిలపైనా మంత్రి నారాయణ మండిపడ్డారు. ఒకవైపు మంజునాథ కమిషన్ పని ప్రారంభించి నివేదిక త్వరలో ఇవ్వనున్న తరుణంలో వీరంతా ఎవరికోసం, ఎందుకోసం ఇలా మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నుంచి వెనక్కు వెళితే పోరాటం చేయడంలో తప్పులేదని, కానీ కమిషన్‌ను నియమించి హామీ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా ముద్రగడ వంటి వారు కాపు ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం సమంజసంగా లేదన్నారు. తుని ఘటన దర్యాప్తులో నిజాలు బయటపడే కొద్ది ముద్రగడలో భయం పట్టుకుందని, అందుకే ఈ రకంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన దాసరి, చిరంజీవి ఏనాడైనా కాపులను బీసిల్లో చేర్చాలని అడిగారా.. కాపుల కోటాలో పదవులు పొందిన వీరు కాపుల కోసం చేసిన ఒక్క మంచి ఉందా అని నారాయణ ప్రశ్నించారు.