రాష్ట్రీయం

ఎండలు పోయనట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ విశాఖపట్నం, మే 29: ఎండాకాలం వెళ్లిపోతోంది. ఎండలు తగ్గుముఖం పట్టాయి. వడగాడ్పులు ఉంటాయని గత చాలా రోజుల నుండి ప్రకటిస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రస్తుతం వడగాడ్పుల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. నైరుతీ రుతుపవనాలు ఇంకా రాకపోయినప్పటికీ, రుతుపవనాల కంటే తొలుత వచ్చే ‘ముందస్తు వర్షాలు’ కురుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది. గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అలాగే కోస్తాలోని గుంటూరు, తెలంగాణలోని మహబూన్‌నగర్ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మే 30, 31, జూన్ ప్రారంభంలో చాలా ప్రాంతాల్లో ఉరుములతో గాలివాన, గాలులు ఉంటాయని ఐఎండి ప్రకటించింది. తూర్పుభారత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి శాస్తవ్రేత్త నరేష్ కుమార్ తెలిపారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు. అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా జిల్లాల్లో నిన్నటి వరకు 45-46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో రెండు మూడు డిగ్రీలు పడిపోయాయి. జంగమేశ్వరపురంలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. తెలంగాణలోని ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. రామగుండం, వరంగల్ జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు.