ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు సుజన, టిజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: రాజ్యసభ స్థానానికి పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరికి తిరిగి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన టిజి వెంకటేష్‌కు రాజ్యసభ టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. తన నివాసంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అభ్యర్థులను ప్రకటించారు. మూడో అభ్యర్థిగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు టిక్కెట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేసి, తమ పార్టీ అభ్యర్థికి రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని కోరడంతో, కాదనలేకపోయానని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం ఎంతో ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తను బిజెపికి టిక్కెట్ ఇచ్చామని చెప్పారు. సుజనా చౌదరి అధికారంలో లేనప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశారని చంద్రబాబు చెప్పారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో గళమెత్తారని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే టిక్కెట్ ఇవ్వడం సబబని భావించామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లా నుంచి రాజ్యసభకు ఎంపికైన వారు లేరని, తొలిసారిగా ఆ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు టిజి వెంకటేష్‌కు టిక్కెట్ ఇచ్చామని ఆయన తెలియచేశారు. వ్యాపారవేత్తలకే టిక్కెట్‌లు ఇచ్చారన్న విమర్శలు తలెత్తవా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెపుతూ వారిని రాజకీయ నాయకులుగానే తాము పరిగణిస్తున్నామన్నారు. టిడిపికి ఉన్న మూడు సీట్లలో ఒకటి బిజెపికి ఇవ్వడం వల్ల, బిసిలకు న్యాయం చేయలేకపోయామని, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పారు. సురేష్‌ప్రభు మంగళవారం తనను కలుస్తారని, అభ్యర్థులంతా మంగళవారమే నామినేషన్లు దాఖలు చేయనున్నారన్నారు. నాలుగో స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్న విషయం నిజమేనా? అని విలేఖరులు ప్రశ్నించగా, దాని గురించి తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిఎం చంద్రబాబు చెప్పారు. వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో నాలుగో సీటును దక్కించుకోవాలని చూస్తున్నారా? అని ప్రశ్నించగా, ఆ విషయాన్ని ఆ ఎమ్మెల్యేలే నిర్ణయించుకుంటారని సిఎం ముక్తసరిగా జవాబిచ్చారు. వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో సమాలోచనల సారాంశమేంటని ప్రశ్నించగా, తాను ముఖ్యమంత్రినని, తనను కలిసేందుకు ఎంతోమంది వస్తుంటారని, ఇప్పుడు మీరు వచ్చారు... అలాగే వాళ్లు కూడా వచ్చారని సిఎం సమాధానం చెప్పారు.
హైదరాబాద్ చేరుకున్న ప్రభు
రాజ్యసభకు నామినేషన్ వేసేందుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సమావేశమవుతారు. ఆ తరువాత ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రభు కూడా నామినేషన్‌ను దాఖలు చేస్తారు.