రాష్ట్రీయం

రాజీనా..? రాజకీయమా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాబాద్, మే 30: రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన ఓటుకు నోటు కేసు చివరకు రెండు రాష్ట్రాల సిఎంల మధ్య రాజీ కుదిర్చి సద్దుమణిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు రాష్ట్రాల్లో కీలక మార్పులకు దోహదమైంది. పదేళ్ల ఉమ్మడి రాజధాని సౌకర్యం ఉన్నా ఆంధ్ర సిఎం చంద్రబాబు రాజధానిని విజయవాడకు తరలించారు. గతంలో ఇద్దరు సిఎంలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు తగ్గించారు. గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన మహానాడులో కెసిఆర్‌నే లక్ష్యం చేసుకుని చంద్రబాబు ఉపన్యాసాలు చేశారు. ఓటుకు నోటు కేసు తరువాత తిరుపతిలో జరిగన మహానాడులో కెసిఆర్‌ను చంద్రబాబు ఎక్కడా ఒక్కమాట అనలేదు. ఇద్దరు సిఎంల మధ్య రాజీ కుదిరిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. కేసుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు రాజీ తీవ్ర నిరాశనే కలిగించింది. దేశంలోనే సంచలం సృష్టించి హఠాత్తుగా సద్దుమణిగిన ఓటుకు నోటు కేసుకు మంగళవారం నాటికి ఏడాది నిండుతుంది. ఎమ్మెల్సీకి ఐదు కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించి ఏసీబీకి పట్టుబడిన వైనం తెలిసిందే. ఇదే తరహాలో ఓటు కొనుగోలు వ్యవహారంలో ఒకవైపు స్వయంగా సిఎంని విచారించగా, తెలంగాణలో మాత్రం ఏడాది గడిచినా కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం ఓటు కొనడానికి జరిగిన ప్రయత్నంపై అప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నట్టు ప్రకటించింది. కానీ తరువాత ప్రభుత్వం నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ కేసుకు సంబంధించి ఎలాంటి కదలికా లేదు. ఈ కేసు సమయంలో హైదరాబాద్‌లో సైతం ఆంధ్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెంనాయుడు ప్రకటించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేయాలని, సిఎం ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితులను బేరీజు వేసుకుంటే, తెర వెనుక ఏదో జరిగిందనే బలమైన ప్రచారం మాత్రం జరిగింది. ఇద్దరి మధ్య రాజీకుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కేసు తరువాత ఆంధ్ర సిఎం చంద్రబాబు పూర్తిగా విజయవాడకు పరిమితమయ్యారు. ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. ఉద్యోగులు వ్యతిరేకించినా, విజయవాడ వచ్చి తీరాల్సిందేనని ఆదేశించారు. మేలోనే కార్యాలయాల తరలింపు ప్రారంభమైంది. జూన్ నాటికి కార్యాలయాలను తరలించి కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే కొనసాగించాలని నిర్ణయించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ సైతం పలు సందర్భాల్లో చంద్రబాబు తనకు మంచి మిత్రుడని కితాబు ఇస్తూ వస్తున్నారు.
రాయలసీమకు నష్టం కలిగే విధంగా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, ఓటుకు నోటు కేసు వల్లే చంద్రబాబు కెసిఆర్‌ను ప్రశ్నించలేకపోతున్నారని ఆంధ్ర విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఈ కేసు కోసం ఆంధ్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారన్నది ఆయన ఆరోపణ. పదేళ్లపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తే తెలంగాణకు లేనిపోని చికాకులు ఉండేవని, కారణం ఏదైనా కావచ్చు బాబు విజయవాడకు వెళ్లిపోవడానికి కేసు దోహదం చేసింది. ఇది తెలంగాణకు ప్రయోజనం కలిగించేదే కదా? అని తెరాస నేతలు అంటున్నారు. ఉమ్మడి రాజధాని, ప్రాజెక్టులు ప్రతి అంశంలోనూ రెండు రాష్ట్రాల మధ్య కీచులాటలు ఉండేవని, కేసు పుణ్యమా అని ఆ సమస్యలు తప్పిపోయాయని, కేసుతో తెలంగాణకు ప్రయోజనమే కలిగిందనేది తెరాస వాదన.
chitram...
క్యాంపు ఆఫీసులో తెలంగాణ సీఎం కెసిఆర్‌ను కలిసిన చంద్రబాబు (ఫైల్ ఫొటో)