రాష్ట్రీయం

ముందుకు సాగని రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30 : నైరుతి రుతుపవనాలు అనుకున్న ప్రకారం ముందుకు సాగడం లేదు. కేరళ తీరాన్ని ఇవి మే 7 న తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి జూన్ 15 న లేదా ఆ తర్వాత వచ్చే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా గత నాలుగు రోజుల నుండి అరేబియా సముద్రంలోనే రుతుపవనాలు తిష్టవేసి ఉన్నాయి. నైరుతీ రుతుపవనాల కారణంగా అండమాన్, నికోబార్ ద్వీపాల్లో గత నాలుగైదు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నైరుతీ రుతుపవనాలు ఈ నెల 31 న లేదా ఆరోజుకు నాలుగు రోజులు అటుఇటుగా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గతంలో ప్రకటించింది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో వీటి రాక వారం రోజుల పాటు ఆలస్యం అవుతోందని తేలడంతో ఒకవైపు రైతులు, మరోవైపు ప్రభుత్వాది నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలా ఉండగా అటు ఎపి ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం విత్తనాల సరఫరా దాదాపు పూర్తి చేశాయి. విత్తనాల కోసం వస్తున్న రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాన్ని అందిస్తున్నారు. విత్తనాలు తీసుకున్న రైతులు వర్షాలు ఎప్పుడు వస్తాయా అంటూ ఆకాశం వైపు ఎగాదిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు క్యుములో నింబస్ మేఘాల కారణంగానే నని వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 30: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ఉరుములతో కూడిన జల్లులు లేదా, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. క్యుములోనింబర్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయని పేర్కొన్నారు.