రాష్ట్రీయం

భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముగింపు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నివాస గృహాలు, ఇతర నిర్మాణాలను నిర్మించుకున్న వారికి నామ మాత్రపు రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రవేశ పెట్టిన జీవో 59 కు కింద భూ హక్కుల పత్రాలను జారీ చేసే ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. క్రమబద్దీకరణ పత్రాలను జారీ చేయడానికి రూపొందించిన ఫార్మెట్‌ను ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకోవడానికి మంగళవారం చివరి తేదీగా భూ పరిపాలన కమిషనర్ (సిసిఎల్‌ఎ) ఆదేశాలు జారీ చేయడంతో రెనిన్యూశాఖ తలమునకలైంది. వాస్తవానికి ఈ ప్రక్రియ సంక్రాంతి నాటికే పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు కొన్ని న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు తలెత్తడంతో జాప్యం జరిగినట్టు అధికార వర్గాల సమాచారం.
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారు దారిద్రరేఖకు దిగువనున్న పేదలు అయితే వారికి 125 గజాల స్థలం వరకు ఉచితంగా క్రమబద్దీకరించేందుకు జీవో 58, అంతకుమించి స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి రిజిస్ట్రేషన్ విలువలో వెసులుబాటుతో 25 శాతం చెల్లింపులతో క్రమబద్దీకరించేందుకు జీవో 59ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. డిసెంబర్ 2014లో జారీ చేసిన ఈ జీవోల కింద ఇప్పటికే ఉచిత క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి అయింది. జీవో 58 పరిధిలోకి రాని దరఖాస్తులను జివో 59కి బదలాయించిన సుమారు 20 వేల దరఖాస్తులు, నేరుగా జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారిని కలిపి రాష్టవ్య్రాప్తంగా దాదాపు నలబై వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎలాంటి వివాదం లేని భూములకు పూర్తిగా డబ్బు చెల్లించిన వారికి మొదటి దశలో క్రమబద్ధీకరించడానికి మే 31ని చివరి గడువుగా సిసిఎల్‌ఎ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు దరఖాస్తుదారులకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక రంగారెడ్డి జిల్లాలో తప్ప చాలా మటుకు ఇతర జిల్లాల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలు కాలేదు. పై అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవంటూ ఇంతకాలంగా జాప్యం చేసిన రెవిన్యూ అధికారులు గడువు ముగియడానికి నాలుగు ఐదు రోజుల నుంచే ఈ ప్రక్రియను చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన వెబ్‌సైట్ మంగళవారం అర్థరాత్రి నుంచి నిలిపి వేయనున్నట్టు సిసిఎల్‌ఎ ఆదేశించడంతో చివరి ఒక్కరోజుననే పూర్తి చేయడానికి రివెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు మొదలు పెట్టారు. కొన్ని జిల్లాల నుంచి అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం వారం రోజుల గడువు పొడిగించాలని సిసిఎల్‌ఎ కమిషనర్‌ను కోరినట్టు తెలిసింది. అయితే సిసిఎల్‌ఎ కమిషనర్ గడువు పెంచడానికి ససేమిరా అనడంతో ఎలాగైనా గడువులోగా పూర్తి చేయడంలో తలమునకలైంది.