రాష్ట్రీయం

ముంచుకొస్తున్న ముహూర్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 31: వచ్చే నెల 27కల్లా రాజధాని అమరావతికి తరలిరావాలని సెక్రటేరియట్ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఇందు కు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. జూన్‌లో సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులు ఇక్కడికి చేరుకోవలసి ఉంది. అలాగే 54 సెక్రటేరియట్‌లు, 110 హెచ్‌ఓడి కార్యాలయాలు విజయవాడకు రావల్సి ఉంది. ప్రస్తుతం ఆయా శాఖల కేంద్ర కార్యాలయాలను విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలని, సీడ్ క్యాపిటల్ వద్ద భవనాలు సిద్ధమైన తరువాత పూర్తి స్థాయిలో ఆయా శాఖలకు శాశ్వత భవనాలు కేటాయిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాత్కాలిక సెక్రటేరియట్‌లో హెచ్‌ఓడిలకు స్థలం లేకపోవడంతో తమ కార్యాలయాలను బయట వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే హెచ్‌ఓడిల కోసం ఎనిమిది లక్షల ఎస్‌ఎఫ్‌టి వైశాల్యం కలిగిన వివిధ భవనాలను అధికారులు చూసి ఉంచారు. ఇవి ఏమాత్రం సరిపోవని హెచ్‌ఓడిలు తేల్చి చెప్పడంతో అదనపు భవనాల వెతుకులాట కోసం ప్రత్యేక కమిటీలు బయల్దేరాయి. సుమారు 50 లక్షల ఎస్‌ఎఫ్‌టి వైశాల్యం కలిగిన భవనాలు కావాలని హెచ్‌ఓడిలు, డైరక్టరేట్ల అధికారులు చెప్పడంతో విజయవాడ చుట్టుపక్కల ఏడు మండలాల్లో అనువైన భవనాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క రెవెన్యూ శాఖకే 75 వేల ఎస్‌ఎఫ్‌టి వైశాల్యం కలిగిన భవనం కావాలని చెపుతున్నారు. ఎందుకంటే అత్యంత విలువైన రెవెన్యూ రికార్డులను భద్రపరచాల్సి ఉన్నందున కొంత సెక్యూరిటీతో కూడిన భవనం కోసం అధికారులు అనే్వషిస్తున్నారు. కాగా, ప్రతి హెచ్‌ఓడికి కనీసం 10 వేల నుంచి 25 వేల ఎస్‌ఎఫ్‌టి వైశాల్యం కలిగిన భవనాలు అవసరమవుతున్నాయి. విజయవాడ నగరంలో కేవలం ఐదు వేల ఎస్‌ఎఫ్‌టికి మించి భవనాలు లేకపోవడంతో విజయవాడ చుట్టుపక్కల మండలాల్లో భవనాల కోసం అధికారులు వెతుకులాట ప్రారంభించారు. డైరక్టరేట్లు, హెచ్‌ఓడిల కోసం 30 లక్షల ఎఎఫ్‌టి వైశాల్యం కలిగిన భవనాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెపుతున్నారు.
ఇదిలా ఉండగా విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఉన్న ఇమ్దా భవన్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోనే మైనార్టీ కార్పొరేషన్, వక్ఫ్‌బోర్డు కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అలాగే సహకార శాఖ కార్యాలయాన్ని గుంటూరులోని శ్యామలానగర్‌లో ఒక భవనాన్ని, నల్లపాడు వద్ద మరొక భవనాన్ని పరిశీలిస్తున్నారు. ఈ వారాంతానికి దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. గొల్లపూడిలోని ఒక భవనంలో రెవెన్యూ కమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈడ్పుగల్లులో వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాగే మరో వారం, పది రోజుల్లో 10 నుంచి 15 డైరక్టరేట్లకు భవనాలు సిద్ధమయ్యే అవకాశం ఉంది.
కార్యాలయాలు సరే! ఇళ్ల మాటేంటి?
సెక్రటేరియట్ ఉద్యోగుల కోసం కార్యాలయాలైతే సిద్ధమవుతున్నాయి కానీ, వారు నివసించేందుకు ఇళ్లు మాత్రం ఇప్పటికీ సిద్ధం కాలేదు. సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్న తుళ్ళూరు, మందడం, తాడికొండ, మంగళగిరి, ఉండవల్లి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు ఇంకా కొలిక్కి రాలేదు. సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల రేట్లు అదిరిపోతున్నాయి. సెక్రటేరియట్ ఉద్యోగులు ఆ అద్దెలను భరించాలంటే, కనీసం ముగ్గురు, నలుగురు కలిసి ఒక ఫ్లాట్ తీసుకోవలసి ఉంటుంది. అద్దెలు తగ్గించకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్‌ను ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా గృహ యజమానులు మాత్రం అద్దె విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.