రాష్ట్రీయం

అసదుద్దీన్‌కు కర్నాటక పోలీసుల నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: కర్నాటకలోని బీజాపూర్‌లో నిర్వహించనున్న ఆలిండియా మజ్లిస్-ఎ-ఇతెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) బహిరంగ సభకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హాజరు కారాదని ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వారం రోజుల పాటు కర్నాటకకు రాకూడదని స్పష్టం చేస్తూ వారు అసదుద్దీన్‌కు దారుస్సలాంలో నోటీసులు అందజేశారు. జూన్ ఒకటిన బీజాపూర్‌లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అసదుద్దీన్‌పై నిషేధాజ్ఞలు విధించారు. ఈ నోటీసులు అందుకున్న అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ, చట్టాన్ని గౌరవిస్తానని, ఈ నోటీసులను ధిక్కరించబోనని తెలిపారు. అయితే పార్టీ సభల్లో ప్రసంగించవద్దంటూ నోటీసులు జారీ చేయడం సమంజసం కాదన్నారు. మైనార్టీలతో పాటు బడుగు, బలహీన వర్గాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

చిత్రం దారుస్సలాంలో ఎంపి అసదుద్దీన్‌కు నోటీసులు అందజేస్తున్న కర్నాటక పోలీసులు