రాష్ట్రీయం

ఎస్సైల భర్తీకి మరోసారి పేపర్-1 నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఢిల్లీ పోలీసు విభాగంలోని సబ్ ఇనస్పెక్టర్లు, సిఎపిఎఫ్‌లు, అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్లు ఉద్యోగాల నియామకానికి పేపర్ -1ను మరోమారు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించాలని స్ట్ఫా సెలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ పరీక్షను గతంలో పరీక్షకు హాజరైన వారు మాత్రమే రాసేందుకు అర్హులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరిలతో కూడిన దక్షిణ ప్రాంతంలో జూన్ 4 నుండి 6వ తేదీ మధ్య రెండు షిఫ్ట్‌లుగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ‘ఎస్సెస్సీఎస్‌ఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు చెప్పారు.